Begin typing your search above and press return to search.

డాలర్ - రూపాయ్... కొత్త చర్చకు తెరలేపిన ఓలా సీఈవో!

తాజాగా సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 9:30 PM GMT
డాలర్ - రూపాయ్... కొత్త చర్చకు తెరలేపిన ఓలా సీఈవో!
X

తాజాగా సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... భారత్ లో విక్రయించే ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ కీబోర్డులపై అమెరికన్ కరెన్సీ "డాలర్" గుర్తు ఎందుకు అంటూ ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ ప్రశ్నించారు. ఇదే క్రమంలో... ఆ డాలర్ స్థానంలో రూపాయి గుర్తును ఉంచాలని సూచించారు. ఈ మేరకు ఈయన "ఎక్స్"లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... భారత్ లో విక్రయించే ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ కీబోర్డులపై అమెరికన్ కరెన్సీ డాలర్ గుర్తు ఎందుకని.. దాని స్థానంలో భారత కరెన్సీ రూపాయి గుర్తు ఉంచాలని భవీశ్ అగర్వాల్ సూచించారు. ఈ మేరకు భవిష్ తన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో డాలర్ గుర్తును హైలైట్ చేస్తూ ఉన్న కీబోర్డ్ ఫోటోను పంచుకున్నారు.

ఈ సందర్భంగా... బహుశా దీనివల్లే ప్రజలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇంకా రూపాయి బదులుగా ఐ.ఏన్.ఆర్. అని రాస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ డాలర్ స్థానంలో రూపాయి గుర్తును ఎందుకు బదిలీ చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పోస్టును దాదాపు 2 మిలియన్ల మంది వరకూ వీక్షించారు!

మరోపక్క ఈ పోస్ట్ పై నెటిజన్ల రియాక్షన్ మిక్స్డ్ గా ఉంది. ఇందులో భాగంగా కొంతమంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తుంటే.. మరికొంతమంది మాత్రం విభేదిస్తున్నారు. ఈ సమయంలో... అమెరికన్ డాలర్ గుర్తు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చాలా కీలకమని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో దీని వినియోగం అవసరమని ఇంకొకరు వెల్లడించారు.

ఇక మరికొంతమంది అయితే... అంతర్జాతీయ ఉత్పత్తులను డాలర్ గుర్తుతో విక్రయించినప్పుడు.. దేశీయ వస్తువులను రూపాయి గుర్తుతోనే అమ్మాలి అంటూ భవీశ్ అగర్వాల్ వాదనకు కొంతమంది మద్దతు పలుకుతున్నారు.