Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే.. ఐఏఎస్ పెళ్లికి 3 లక్షల మందికి శుభలేఖలు

చూసినంతనే సినీహీరోయిన్లు మాదిరి ఉండే ఇద్దరు ప్రముఖుల పెళ్లి వేడుక దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:07 AM GMT
ఆ ఎమ్మెల్యే.. ఐఏఎస్ పెళ్లికి 3 లక్షల మందికి శుభలేఖలు
X

చూసినంతనే సినీహీరోయిన్లు మాదిరి ఉండే ఇద్దరు ప్రముఖుల పెళ్లి వేడుక దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది. వరుడేమో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనమడు. అంతేనా.. ప్రస్తుతం ఎమ్మెల్యే. పేరు.. భవ్య భిష్ణోయ్. ఇక.. పెళ్లి కుమార్తె ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిణి. ఆమె పేరు.. పరి బిష్ణోయ్. వీరిద్దరి మధ్య పుట్టిన ప్రేమబంధాన్ని పెళ్లితో మరో లెవల్ కు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.

భవ్య బిష్ణోయ్ తాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనమడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన తండ్రి బీజేపీ నేత.. మాజీ ఎంపీ. పెళ్లి కుమార్తె విషయానికి వస్తే ఆమె 2019లో సివిల్స్ సాధించారు. ఆమెది రాజస్థాన్. ప్రస్తుతం సిక్కిం కేడర్ కింద గ్యాంగ్ టక్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగింది. అప్పుడే వీరి వ్యవహారందేశ వ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది.

తాజాగా వీరి పెళ్లికి ముహుర్తం డిసైడ్ చేసేశారు. డిసెంబరు 22న వీరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి వచ్చేందుకు ఢిల్లీతో పాటు.. వివిధ రాష్ట్రాలతో సహా మొత్తం మూడు లక్షల మందికి వివాహ ఆహ్వానపత్రాలు వెళ్లాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగుతుండగా.. పుష్కర్.. అదంపుర్.. ఢిల్లీ నగరాల్లో మూడు రిసెప్షన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మొత్తం వేడుకలకు కలిపి దగ్గరదగ్గర మూడు లక్షల మంది కనీసం హాజరవుతారన్నది అంచనా. పెళ్లి అనంతరం రాజస్థాన్ లోని పుష్కర్ సిటీలో ఒక రిసెప్షన్ ను నిర్వహిస్తారు. పెళ్లి కుమారుడి తాత కాలం నుంచి ఈ ప్రాంతంలో పట్టు ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 80 గ్రామాలకు పైగా ప్రజలను ఈ పెళ్లి వేడుకకు పిలుస్తున్నారు. భవ్య బిష్ణోయ్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. నిజానికి.. ఇతగాడి పెళ్లి మొదట్లో సినీ నటి మెహ్రీన్ తో అనుకున్నారు. ఇందులో భాగంగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే.. అనంతరం వీరి పెళ్లి రద్దైంది. ఇరువురు బ్రేకప్ చెప్పుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా ఐఏఎస్ అధికారిణితో పెళ్లి జరగనుంది.