Begin typing your search above and press return to search.

మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోని ఆయ‌న మ‌రో బిడ్డ‌కు తండ్రెలా? .. ముఖ్య‌మంత్రిపై కుమార్తె ఫైర్‌!

పంజాబ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌.. ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:50 PM GMT
మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోని ఆయ‌న మ‌రో బిడ్డ‌కు తండ్రెలా? .. ముఖ్య‌మంత్రిపై కుమార్తె ఫైర్‌!
X

రాజ‌కీయాల్లో ఉన్న వారికి ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం.. భేదాభిప్రాయాలు రావ‌డం.. స‌హ‌జం అందునా అధికారంలో ఉన్న పార్టీకి అయితే మ‌రింత సెగ త‌ప్ప‌దు. అయితే, అనూహ్యంగా ఈ సెగ‌, పొగ సొంత ఇంటి నుంచే వ‌స్తే..? ప‌దునైన విమ‌ర్శ‌లు క‌న్న బిడ్డ‌ల నుంచి ఎదురైతే..? ఇది ఊహించ‌డానికి కూడా ఇబ్బందే. అలాంటి ప‌రిస్థితి.. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌కు ఎద‌రైంది.

పంజాబ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌.. ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నారు. నిజానికి మాన్‌కు అంత‌కు ముందే వివాహ‌మైంద‌న్న విష‌యాన్ని ఆయ‌న దాచారు. ఇక‌, ఈ రెండో పెళ్లికి.. కీల‌క నాయ‌కులు కూడా వ‌చ్చి ఆశీర్వ‌దించారు. ఇక‌, మాన్ దంప‌తుల‌కు బిడ్డ పుట్ట‌నుంది. ప్ర‌స్తుతం మాన్ స‌తీమ‌ణి గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలో తాజాగా.. మాన్ మొద‌టి భార్య‌కు జ‌న్మించిన ఇద్ద‌రు పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

తాజాగా ముఖ్య‌మంత్రి మాన్ పై ఆయ‌న తొలి భార్య‌కు జ‌న్మించిన‌ కుమార్తె సీర‌త్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోని, మ‌మ్మ‌ల్ని సాక‌ని.. బాధ్య‌త‌లు ప‌ట్ట‌ని ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రో బిడ్డ‌కు తండ్రి అవ్వాల‌ని ఎలా అనుకుంటున్నారు?`` అని నిల‌దీశారు. అంతేకాదు.. త‌న త‌ల్లి, సోద‌రుడు త‌మ తండ్రి వ‌ల్ల జ‌రిగిన అన్యాయానికి మౌనంగా రోదిస్తున్నామ‌ని.. మేం బ‌య‌ట‌కు వ‌స్తే.. ఆయ‌న ప‌రిస్థితి ఏంటో అర్థ‌మ‌వుతుంద‌ని వ్యాఖ్యానించారు.

``మేము, మా త‌ల్లి మౌనంగా ఉండ‌బ‌ట్టే ఆయ‌న ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్నారు`` అని సీర‌త్ వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలావుంటే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడైన మాన్‌.. గ‌తంలో పార్ల‌మెంటుకు కూడా ఎన్నిక‌య్యారు. అయితే, ఆయ‌న‌కు మ‌ద్యం అల‌వాటు ఉన్న‌నేప‌థ్యంలో అనేక సంద‌ర్భాల్లో పార్ల‌మెంటులో స‌భ్యులు ఆయ‌న‌పై ఫిర్యాదులు చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో ఆప్ గెలుపుగుర్రం ఎక్క‌డంతో మాన్ ముఖ్య మంత్రి అయ్యారు.