Begin typing your search above and press return to search.

భోలే బాబా ఆస్తులు.. కళ్లు చెదరాల్సిందే!

గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన సూరజ్‌ పాల్‌ ఆ«ధ్యాత్మికత వైపు మళ్లి భోలే బాబాగా అవతారమెత్తాడు.

By:  Tupaki Desk   |   5 July 2024 5:22 PM GMT
భోలే బాబా ఆస్తులు.. కళ్లు చెదరాల్సిందే!
X

ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌ లో జూలై 2న భోలే బాబా కాలి మట్టిని తీసుకోవడానికి వెళ్లిన 121 మంది భక్తులు తొక్కిసలాటలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన ఆరుగురిని అరెస్టు చేసింది.

కాగా అసలు ఈ భోలే బాబా, ఆయన ఆస్తుల వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన సూరజ్‌ పాల్‌ ఆ«ధ్యాత్మికత వైపు మళ్లి భోలే బాబాగా అవతారమెత్తాడు. తన బోధనల ద్వారా భారీ ఎత్తున భక్తులను ఆకర్షించారు. లక్షల సంఖ్యలో బాబాకు భక్తులున్నారు.

భోలే బాబాను నారాయణ్‌ సకర్‌ హరి, జగత్‌ గురు విశ్వహరి అనే పేర్లతోనూ పిలుస్తున్నారు. ఆయనకు మొత్తం 24 ఆశ్రమాలు ఉన్నాయి. రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. భోలే బాబా ఆశ్రమ వ్యవహారాలను

శ్రీ నారాయణ్‌ హరి సకర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది.

సూరజ్‌ పాల్‌ ఎలియాస్‌ భోలే బాబా ఎప్పుడూ తెల్లటి సూట్‌ లో భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే కళ్లద్దాలు, టై ధరిస్తారు. అతడు భక్తుల వద్దకు రావడం ఒక దేశాధ్యక్షుడి రాకను తలపిస్తుందని అంటున్నారు. కాన్వాయ్‌కు నాయకత్వం వహిస్తూ శక్తివంతమైన 350 సీసీ ఇంజన్‌ మోటార్‌సైకిళ్లపై 16 మంది కమాండోలు, 15 నుండి 30 వాహనాలకు మార్గం సుగమం చేస్తారు.

భోలే బాబా కమాండోల మధ్య తెల్లటి టయోటా ఫార్చ్యూనర్‌ లో ప్రయాణిస్తారు. అందులో సీటు కవర్లు, లోపలి భాగాలు అన్నీ కూడా తెల్ల రంగులోనే ఉంటాయని చెబుతున్నారు.

భోలే బాబా ఉత్తరప్రదేశ్‌ లోని బిచువాలోని మెయిన్‌ పురి ఆశ్రమంలో నివసిస్తున్నారు, ఇది హరి నగర్‌ అని పిలువబడే 21 బిఘాల భూమిని కలిగి ఉంది. ఈ ఎస్టేట్‌లో భోలే బాబాకు, ఆయన భార్యకు ఆరు విశాలమైన గదులు ఉన్నాయి.

మెయిన్‌ పురి ఆశ్రమం ప్రవేశ ద్వారం వద్ద రూ. 10,000 నుండి రూ. 2.5 లక్షల వరకు విరాళాలు అందించిన 200 మంది దాతల పేర్లు ఉంటాయి. ప్రధానంగా భక్తులు ఇచ్చే విరాళాల ద్వారానే బాబా ఆశ్రమాలు నడుస్తున్నాయి.

భోలే బాబాకు కేవలం ఉత్తర ప్రదేశ్‌ లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో 24 ఆశ్రమాలు ఉన్నాయి. మెయిన్‌ పురిలో ఉన్న ఆశ్రమం మూడు సంవత్సరాల క్రితం పూర్తయింది. ఈ ప్రత్యేక ఆశ్రమం ఆయన నివాసంగా, కార్యస్థలంగా ఉంది.

అలాగే భోలే బాబా ఆశ్రమాల్లో అనేక మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్నాయి. కాన్పూర్‌ లోని బిద్ను ప్రాంతంలో, ప్రత్యేకంగా కసుయ్‌ గ్రామంలో, సేవాదార్లుగా పిలువబడే స్వచ్ఛంద సేవకులు నివసించే అనుబంధ ఆశ్రమం ఉందని సమాచారం. వీటికి అదనంగా, ఇటావాలోని భూపత్‌ సరాయ్‌ లో 15 బిఘాల భూమిలో కొత్త ఆశ్రమం నిర్మిస్తున్నారు.

బోభే బాబా మీద గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 1997లో కొన్నాళ్లు ఆయన జైలులో కూడా గడిపాడు. ఇదే కాకుండా ఇతర కేసులు కూడా ఉన్నాయి. జైలు నుంచి విడుదలయ్యాకే సాకర్‌ విశ్వ హరి బాబాగా ఆధ్యాత్మిక బోధనలు ప్రారంభించాడు. అయినప్పటికీ ఆయన గణనీయ సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూనే ఉండటం గమనార్హం.