Begin typing your search above and press return to search.

ఆధ్యాత్మిక మృత్యు రాష్ట్రం.. ఘోరం వెనుక నేరమెవ‌రిది?

ఎటా జిల్లాలో జ‌రిగిన‌.. స‌త్సంగ్‌లో భోలే బాబా పాద ధూళి కోసం ఎగ‌బ‌డిన భ‌క్తులు తొక్కిస‌లాట‌లో మృత్యువు కోర‌ల్లో చిక్కుకుని న‌లిగిపోయారు.

By:  Tupaki Desk   |   3 July 2024 7:54 AM GMT
ఆధ్యాత్మిక మృత్యు రాష్ట్రం.. ఘోరం వెనుక నేరమెవ‌రిది?
X

ఆధ్యాత్మిక‌.. రాష్ట్రంగా.. అయోధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్త‌ర ప్ర‌దేశ్‌.. ఇప్పుడు ఆధ్యాత్మిక మృత్యు రాష్ట్రంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో అయోధ్య రామ‌య్య ప్ర‌తిష్టాప‌న స‌మ యంలో ప్ర‌పంచం మొత్తం యూపీవైపు చూసింది. ఇక‌, ఇప్పుడు కూడా.. ప్ర‌పంచం ఈ రాష్ట్రం వైపు చూస్తోంది. ఎటా జిల్లాలో జ‌రిగిన‌.. స‌త్సంగ్‌లో భోలే బాబా పాద ధూళి కోసం ఎగ‌బ‌డిన భ‌క్తులు తొక్కిస‌లాట‌లో మృత్యువు కోర‌ల్లో చిక్కుకుని న‌లిగిపోయారు.

ప్ర‌స్తుతం మృతుల సంఖ్య 150 పైకి చేరింది. ఇంత ఘోరం గత నాలుగు మాసాల్లో చోటు చేసుకోవ‌డం ఇదే తొలిసారి. ఓ ఆరు మాసాల కింద‌ట మాత్రం ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంలో 350 మంది మృతి చెందారు. మ‌ళ్లీ ఇప్పుడే ఆ త‌ర‌హా ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే.. రైలు ప్ర‌మాదం వేరు.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న వేరు. వాస్త‌వానికి యూపీని ఆధ్యాత్మిక న‌గ‌రంగా.. రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌నేది బీజేపీ స‌ర్కారు, పెద్ద‌ల ఆలోచ‌న‌. ఇదే రాను రాను.. మూఢ‌న‌మ్మ‌కాలు పెంచింది.

అయోధ్య రాముడి.. అక్ష‌త‌లను ఇంటింటికీ పంపిణీ చేయ‌డం నుంచి అయోధ్య మ‌ట్టిని కూడా.. దేశ‌వ్యా ప్తంగా పంపిణీ చేయ‌డం వ‌ర‌కు స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఎవ‌రైనా విమ ర్శ‌లు చేస్తే.. వారిని హిందూ వ్య‌తిరేకిగాముద్ర వేయ‌డం మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది, వ‌చ్చింది.. ఏమీ లేదు. తాజా విష‌యానికి వ‌స్తే.. ఎటా జిల్లాలో భోలే బాబా స‌త్సంగ్‌కు అనుమ‌తి ఇచ్చిన విధాన‌మే త‌ప్ప‌ని స్థానిక ప‌త్రిక‌లు ఎండ‌గుడుతున్నాయి.

ఎందుకంటే.. ప్ర‌చారానికి ఏర్పాట్ల‌కు మ‌ధ్య లింకు కుద‌ర‌లేదు. పైగా.. బోలే బాబా పాద ధూళితో అప్పులు తీరి.. ఐశ్వ‌ర్య వంతుల‌వుతారంటూ.. ఆయన అనుచ‌రులుటీవీల్లో పెట్టిన డిబేట్లు.. చేసిన ప్ర‌చారం కూడా.. ప్ర‌స్తుత ఘోర క‌లికి కార‌ణం. ఇవ‌న్నీ..తెలిసి కూడా.. ఎటా జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీలు ఒక్క‌రంటే ఒక్క‌రూ స్పందించ‌లేదు. చిత్రం ఏంటంటే.. అప్పులు తీరిపోతాయ‌న్న ప్ర‌చారం న‌మ్మి.. రాజ‌ధాని ల‌క్నో నుంచి కూడా ప్ర‌త్యేక బ‌స్సులు పెట్టుకుని స‌త్సంగ్‌కు హాజ‌రైన వారున్నారు.

ఏ బాబా మ‌ట్టి కోసం అయితే.. ప్ర‌య‌త్నించారో.. అప్పులు తీరుతాయ‌ని ఐశ్వ‌ర్య వంతులు అవుతార‌ని ఆశించారో.. అదే మ‌ట్టిలో 150కి పైగా ప్రాణాలు పోయాయి. మ‌రి ఇప్పుడు ఎవ‌రు బాధ్యులు? భోలే బాబా.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా.. ఈయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌తోనూ సంబంధాలు ఉండ‌డం.. అయోధ్య రామాల‌యానికి భూరి విరాళాలు ఇప్పించ‌డం నేప‌థ్యంలో భోలే బాబా బ‌తికి పోతారు. కానీ, చ‌చ్చిపోయిన అమాయ‌కుల కుటుంబాల ప‌రిస్థితి ఏంటి? ఓ రెండు ల‌క్ష‌లు ఇచ్చి చేతులు దులుపుకొంటే.. అయిపోయిన‌ట్టేనా?!