మంచు మనోజ్ భార్య మాస్ వార్నింగ్... పోలీసులకేనా?
మంచు ఫ్యామీలీలో మంటల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Dec 2024 4:06 PM GMTమంచు ఫ్యామీలీలో మంటల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ఫ్యామిలీలో చిన్న గొడవ అని ఒకరన్నా.. ప్రతీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఉండేదే అని ఇంకొకరు స్మూత్ గా చెప్పినా.. పరిస్థితులు మాత్రం అలా లేవని, వ్యవహారం పీక్స్ కి చేరుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ అటు మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ వినిపిస్తుందని అంటున్నారు.
ఈ సమయంలో.. తమ కుటుంబంలో తలెత్తిన విభేదాల విషయమై మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక తెలంగాణ అదనపు డీజీపీ మహేష్ భగవత్ ను కలిశారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను వివరించారని అంటున్నారు. ఈ సమయంలో.. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు.
ఇలా తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు నివాసానికి చేరుకోగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు! దీంతో గేట్లు నెట్టుకుని బలవంతంగా లోపలికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు అక్కడ నుంచి పంపించేశారని అంటున్నారు.
ఈ సమయంలో లోపల ఏమి జరిగిందనే విషయం పూర్తిగా స్పష్టత లేనప్పటికీ.. చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారని అంటున్నారు. దీంతో... మనోజ్ పై దాడి జరిగిందనే చర్చ అక్కడున్న మీడియా ప్రతినిధుల మధ్య నెలకొందని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ లో మౌనిక వాగ్వాదానికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది!
అవును... "మనోజ్ కు గాయాలయ్యాయి.. నా పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేటు కేసు వేస్తా.. మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారు.. మా బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారు.. వారిని ఎలా బయటకు పంపుతారు..? పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి" అంటూ మౌనిక మాట్లాడినట్లు తెలుస్తోంది!
దీంతో... మౌనిక వార్నింగ్ ఇచ్చింది స్థానిక పోలీస్ అధికారులకు అయ్యి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని మనోజ్ దంపతులకు అడిషనల్ డీజీపీ సూచించినట్లు చెబుతున్నారు. అంతకముందు.. తన బౌన్సర్లను వెనక్కి పంపించేస్తున్నారంటూ పహాడీ షరీఫ్ ఎస్సై పై మనోజ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే!