Begin typing your search above and press return to search.

నా కొడుకుని ఓడించండి...గట్స్ ఉన్న స్టేట్మెంట్ ఇచ్చేసిన భూమన!

తన కుమారుడి తాగుబోతు, కబ్జాదారుడు కారు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాను ధైర్యంగా చెప్పగలను అని భూమన అన్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 2:45 AM GMT
నా కొడుకుని ఓడించండి...గట్స్ ఉన్న స్టేట్మెంట్ ఇచ్చేసిన భూమన!
X

నా కొడుకుని గెలిపించండి అని ఎవరైనా తండ్రి జనాలను కోరుతారు. కానీ తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకరరెడ్డి నా కొడుకుని ఓడించండి అని గట్స్ ఉన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు ఇది నిజంగా భూమన కరుణాకరరెడ్డి బోల్డ్ నెస్ ని డేరింగ్ ని తెలియచేస్తుంది అని అంటున్నారు. ఆయన తిరుపతిలో జరిగిన వైసీపీ సభలో మాట్లాడుతూ తన రాజకీయం గురించి కుమారుడి పొలిటికల్ లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాను ట్రెడిషనల్ పాలిటిక్స్ రూట్స్ నుంచి రాలేదు అని గతాన్ని నెమరేసుకున్నారు. 1972లో అంటే ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం ర్యాడికల్ పోరాటంలో తాను విద్యార్ధి దశలో ఉంటూ వచ్చిన వాడిని అని చెప్పుకొచ్చారు. అలా ఎమర్జెన్సీ టైం లో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించిన వాడిని అన్నారు. తాను దేశం కోసం పాటుపడ్డానని, ఉద్యమాలు చేశానని అలాగే తన కుమారుడు అభినయ్ రెడ్డిని పెంచానని చెప్పారు.

తన కుమారుడి తాగుబోతు, కబ్జాదారుడు కారు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాను ధైర్యంగా చెప్పగలను అని భూమన అన్నారు. తన కుమారుడు యోగ్యుడు సమర్ధుడు అని మీకు అనిపిస్తే గెలిపించండి లేకపోతే మీరే ఓడించండి అని జనాలకే భూమన ఆప్షన్ ఇచ్చేశారు. తిరుపతి వంటి సిటీకి ఎమ్మెల్యే అయ్యే అర్హత నా బిడ్డలో ఉంటేనే గెలిపించండి అని భూమన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

తాను తిరుపతి అబివృద్ధికి నలభై ఏళ్లుగా కృషి చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తన తరువాత తన కుమారుడు కూడా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పాటుపడుతున్నారని ఆయన అన్నారు. తిరుపతి ప్రగతి విషయంలో ఎక్కడా తాను రాజీ పడలేదని, తన కుమారుడు కూడా అదే ఆసక్తితో పనిచేస్తున్నారు అని అన్నారు.

ఇదిలా ఉంటే తిరుపతి ఎమ్మెల్యేగా భూమన 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. 2014లో ఆయన ఓడారు, ఇక 2019లో మరోసారి గెలిచారు ఇక తనకు ప్రత్యక్ష రాజకీయాలు వద్దు అని తన వారసుడిగా అభినయ్ రెడ్డిని వైసీపీ తరఫున రంగంలోకి దించారు. ఆయనకు వైసీపీ అధినాయకత్వం టికెట్ ని కన్ ఫర్మ్ చేసింది అని అంటున్నారు. అందువల్లనే తిరుపతి సభలో నా కొడుకుని గెలిపించండి అంటూనే అర్హత లేదని అనుకుంటే ఓడించండి అని భూమన పిలుపు ఇచ్చారు. ఇపుడు భూమన ఇచ్చిన పిలుపు మీదనే పార్టీ లోపలా బయటా చర్చ సాగుతోంది.

ఎందుకంటే తిరుపతి నుంచి జనసేన తరఫున ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని కూడా అంటున్నారు. టీడీపీకి జనసేనలకు ఇక్కడ బలం ఉంది. పొత్తులు కూడా ఉంటే గట్టి ఫైట్ ఇస్తారు. దాంతో ముందుగానే భూమన తనదైన శైలిలో కొడుకు కోసం ప్రచారం మొదలెట్టేసారు అని అంటున్నారు. అర్హత అన్న పదం ఆయన వ్యూహాత్మకంగానే వాడారు అని అంటున్నారు ఎమ్మెల్యేగా పనిచేయడానికి అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉండడానికి తన కుమారుడికి అర్హత ఉందని భావిస్తూనే గట్స్ తో ఆయన ఒక రకమైన పిలుపు ఇచ్చారని అంటున్నారు. మరి ఈ సవాల్ ని విపక్షాలు ఎలా స్వీకరిస్తాయో చూడాల్సి ఉంది.