Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి దారుణహత్య!

ఈ కుంగుబాటుకు ప్రభుత్వమే కారణమంటూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసు వేసిన వ్యక్తే బుధవారం హత్యకు గురైంది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 4:43 AM GMT
బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి దారుణహత్య!
X

బుధవారం సాయంత్రం తెలంగాణలోని భూపాలపల్లిలో జరిగిన ఒక హత్య రాజకీయ వర్గాల్లోనే కాదు.. అందరి అటెన్షన్ ఒక్కసారి ఈ క్రైం మీద పడేలా చేసింది. అలా అని హత్యకు గురైన వ్యక్తి ప్రముఖుడు కాడు. రాజకీయాల్లో పేరున్న వ్యక్తి అసలే కాదు. కానీ.. ఎందుకిలా? అంటే.. గతంలో అతను చేసిన ఒక కంప్లైంట్ అతడ్ని మిగిలినవారికి భిన్నంగా మార్చటమే కాదు.. ప్రత్యేక వ్యక్తిగా మార్చింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో (కచ్ఛితంగా అయితే తొమ్మిదిన్నరేళ్లు) గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం ఒక మచ్చగా మారిన సంగతి తెలిసిందే.

ఈ కుంగుబాటుకు ప్రభుత్వమే కారణమంటూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసు వేసిన వ్యక్తే బుధవారం హత్యకు గురైంది. భూపాలపల్లికి చెందిన 47 ఏళ్ల రాజలింగమూరతిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రోడ్డు మీద కాపుకాసి మరీ.. ఆయన్ను కత్తులు.. గొడ్డళ్లతో నరికి చంపారు. గతంలో భూతగదాల విషయమైన పలు కేసులు నమోదయ్యాయని.. ఈ హత్యలకు అదే కారణంగా భావిస్తున్నారు. రాజలింగమూర్తి విసయానికి వస్తే.. వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్తగా స్థానికంగా సుపరిచితుడు. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫు ఎన్నికయ్యారు.

అయితే.. ఎన్నికైన కొన్ని నెలలకే ఆమెను బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజలింగమూర్తి స్వగ్రామం (ఫక్కీరుగడ్డ)లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన..టూవీలర్ మీద భూపాలపల్లికి తిరిగి వస్తుండగా ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. మంకీ క్యాపులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టి.. ఒక్కసారిగా కత్తులు.. గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతో పాటు.. కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చిన పరిస్థితి. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించేసరికే ప్రాణాలు పోయినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.

గడిచిన రెండు దశాబ్దాలుగా వరంగల్ కు చెందిన ఒక ప్రముఖ లాయర్ ద్వారా భూ సమస్యల్ని పరిష్కరించే వారన్న పేరు రాజలింగమూర్తికి ఉంది. ఇతడిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బ తింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కంప్లైంట్ చేశారు. అయితే.. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి.. మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య..వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణంగా రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. భర్త హత్యకు నిరసనగా భూపాలపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించి.. నిరసన తెలిపారు.