Begin typing your search above and press return to search.

కుప్పం నుంచి బరిలో నారా భువనేశ్వరి... వీడియో వైరల్!

ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:37 AM GMT
కుప్పం నుంచి  బరిలో నారా భువనేశ్వరి... వీడియో వైరల్!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో తాను కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో... సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ఈలల, చప్పట్లతో ఆమెకు వెల్ కం చెప్పారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న చంద్రబాబు... వరుసగా గెలుస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలో ఆమె రెండు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా... మృతుల కుటుంబాలకు ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు! ఈ సమయంలోనే కుప్పంలో పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడిన నారా భువనేశ్వరి... తనకు మనసులో ఒక కోరిక కలిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి.. తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు భువనేశ్వరి ప్రకటించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షం వ్యక్తం చేసారు.

మరోపక్క... ఈ సారి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తు చేస్తోందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను వైఎస్ జగన్.. మంత్రి పెద్దిరెడ్డిపై ఉంచారని అంటున్నారు. అయితే... చంద్రబాబు మాత్రం తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా రెగ్యులర్ గా కుప్పంలో పర్యటిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి!