Begin typing your search above and press return to search.

తెలంగాణా పగ్గాలు భువనేశ్వరికి...?

తన సతీమణి రాజకీయ వాసనలు ఏ మాత్రం లేని నారా భువనేశ్వారిని తెలంగాణా బాధ్యతలు చూసేలా బాబు ప్లాన్ చేశారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:27 PM GMT
తెలంగాణా పగ్గాలు భువనేశ్వరికి...?
X

చంద్రబాబు ఆబ్సెన్స్ లో టీడీపీని నడపడం కష్టమే. కానీ చంద్రబాబు తాను జైలు గోడల మధ్యన ఉంటూనే ఏపీ తెలంగాణా రెండు చోట్లా తన కనుసన్నలలో పార్టీ నడిచే విధంగా చూసుకుంటున్నారు. సీనియర్లతో కమిటీని వేసి ఏపీలో పార్టీ బండిని లాగుతున్న చంద్రబాబు ఎన్నికలు తరుముకుని వచ్చిన తెలంగాణా నాయకత్వం విషయంలో కూడా ఒక పరిష్కారం కనుగొన్నారని ప్రచారం అయితే సాగుతోంది.

తన సతీమణి రాజకీయ వాసనలు ఏ మాత్రం లేని నారా భువనేశ్వారిని తెలంగాణా బాధ్యతలు చూసేలా బాబు ప్లాన్ చేశారు. ములాఖత్ ద్వారా బాబు అన్ని రకాలుగా డైరెక్షన్ చేస్తూ వస్తారు. ఇక అక్కడ నిర్ణయాలను చూడడం కో ఆర్డినేట్ చేసుకోవడం, అలాగే ఇతర పార్టీలతో పొత్తులు వంటివి చూడడం అన్నవి భువనేశ్వరి ఆద్వర్యంలో జరుగుతాయని అంటున్నారు.

ఇక ప్రచార బాధ్యతలు మాత్రం నందమూరి బాలక్రిష్ణకు అప్పగించారని అంటున్నారు. దీంతో తెలంగాణాలో తెలుగుదేశం పోటీ వ్యవహారాలు అభ్యర్ధుల ఎంపిక వంటివి అన్నీ కూడా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణా ఎన్నికల్లో దాదాపుగా తొంబై సీట్లకు టీడీపీ పోటీ పడాలని భావిస్తోంది. దాంతో సీట్ల ఎంపిక అన్నది ఇపుడు బిగ్ టాస్క్ కానుంది. ఎన్నికలు ముంచుకుని వచ్చేశాయి. అన్ని పార్టీలు అభ్యర్ధులను వరసబెట్టి ప్రకటిస్తున్నాయి. టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది. చాలా కాలం క్రితమే చంద్రబాబు తెలంగాణా పోటీల మీద స్పష్టత ఇచ్చారు.

ఇపుడు చూస్తే ఆయన జైలు గోడల మధ్యన ఉన్నారు, మరి ఆయన అక్కడ నుంచే అభ్యర్ధులను ఎంపిక చేసారు అని అంటున్నారు. అదే టైం లో సరిగ్గా అభ్యర్ధుల ఎంపిక అలాగే ఎన్నికల వ్యవహారాలు అన్నీ చూసుకునేలా భువనేశ్వరికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఆమె తెలంగాణా సీనియర్ నేతలు ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ తో కలసి తెలంగాణా ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కొంటారని అంటున్నారు. ఇక బాలయ్య మాత్రం ప్రచారం చేసి పెట్టేలా అంతా సిద్ధం చేస్తారని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఆ మధ్యన బాలయ్య తెలంగాణా పార్టీని తానే చూసుకుంటాను అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఇపుడు ఆయన కేవలం ప్రచారానికే పరిమితం అవుతారని తెలుస్తోంది. పార్టీని భువనేశ్వరి చేతిలలోనే పెట్టి ఆమె ద్వారానే అంతా నడిపించాలని బాబు చూస్తున్నారు. మరి దీని మీద బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఆయన ప్రచారం చేసి తెలంగాణా టీడీపీకి ఆశావహంగా పరిస్థితులు వచ్చేలా చూస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.