Begin typing your search above and press return to search.

సంచలనం... సర్పంచ్ పదవి కోసం రూ. 2 కోట్లు!

ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ప్రధానంగా ముగ్గురు మధ్య భారీ పోటీ నెలకొంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 4:30 PM GMT
సంచలనం... సర్పంచ్  పదవి కోసం రూ. 2 కోట్లు!
X

కొన్ని సంఘటనలు పరిగణలోకి తీసుకున్నప్పుడు భారతదేశంలో రాజకీయాలకంటే మెరుగైన, మేలైన, లాభదాయమైన వ్యాపారం మరొకటి లేదని ఒకరంటే... పెట్టుబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని మరికొంతమంది చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ కామెంట్స్ కు బలం చేకూరుస్తూ.. సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్లు అనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోవల్ కలాన్ సరిహద్దు గ్రామం, సర్పంచ్ పదవికి వేలం వేసింది! ఈ వేలంలో ఆ సర్పంచ్ పదవి రూ.2 కోట్ల మార్కును తాకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ వ్యవహారంలో స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మసింగ్ అత్యధిక బిడ్ వేయడం ద్వారా మిగిలిన ఇద్దరు ప్రత్యర్థులను ఓడించారు.

ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ప్రధానంగా ముగ్గురు మధ్య భారీ పోటీ నెలకొంది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి ఆత్మసింగ్, జస్విందర్ సింగ్ బేడి, నిర్భైర్ సింగ్ లు పోటీ పడ్డారు. ఈ సమయంలోనే ఆత్మసింగ్ రూ.2 కోట్లు బిడ్ వేసి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఈ నిధులు గ్రామ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ, పంచాయతీ గ్రాంటులతో సంబంధం లేకుండా నిధులను ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ గ్రామ యువజన సమ్మేళనం! ఇలా వేలం వేసి సర్పంచ్ ను ఎన్నుకునే విషయంలో ఈ గ్రామం పేరు గడించిందని చెబుతున్నారు.

వాస్తవానికి ఈ వేలం రూ.50 లక్షలతో ప్రారంభమైంది. అనంతరం వేగంగ పెరగడం మొదలైంది. ఈ సమయంలో ఆత్మసింగ్ ఈ పదవి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... తన తండి కూడా గతంలో సర్పంచ్ గా పనిచేశారని.. ఆయన చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే తాను కూడా సర్పంచ్ కావాలని నిర్ణయించుకుని.. గరిష్టంగా ఆఫర్ చేయాలని ఫిక్సైనట్లు తెలిపారు. ఈ గ్రామంలో 350 ఎకరాల భూమి ఉందని.. తాను బాద్యతలు స్వీకరించిన తర్వాత, గ్రామంలోని యువకులతో కలిసి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఆత్మసింగ్ చెప్పుకొచ్చారు.