Begin typing your search above and press return to search.

పార్టీ మండల అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు! కావలి వైసీపీలో ముసలం

నెల్లూరు జిల్లా వైసీపీలో వ్యతిరేక స్వరాలు ఎక్కువవుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే కావలి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 10:49 AM GMT
పార్టీ మండల అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు! కావలి వైసీపీలో ముసలం
X

నెల్లూరు జిల్లా వైసీపీలో వ్యతిరేక స్వరాలు ఎక్కువవుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే కావలి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తీరును నిరసిస్తూ ప్రత్యేక సమావేశమైన పార్టీ మత్స్యకార నేతలు, మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

వైసీపీకి గట్టి పట్టున్న కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరుపై మత్స్యాకర నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ మండలాధ్యక్ష పదవిని రామిరెడ్డి రూ.50 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ తుమ్మలపెంట సముద్ర తీరం వద్ద వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మత్స్యాకార నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇకపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నాయకత్వంలో పనిచేయకూడదంటూ నేతలు అంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత జగన్ ను కలిసి రామిరెడ్డిపై ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీ నేతలకు రామిరెడ్డి ఫోన్ చేస్తూ బెదిరిస్తున్న విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నేతలు భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి బలం ఉండేది. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోలే, పార్టీ నిస్తేజంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నేతలతో కలిసి పనిచేయాల్సిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు కావలి ఘటన చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం నిర్వహించిన దిగువస్థాయి క్యాడర్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించడం హీట్ పుట్టిస్తోంది.