"హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్" ట్రంప్ కు మద్దతు... కారణం ఇదేనట!
ఇలా "హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్" అనే సంస్థ కమలా హారీస్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోవడం, ట్రంప్ వల్ల భారత్ కు మేలు అన్నట్లుగా వ్యాఖ్యానించడంతో
By: Tupaki Desk | 7 Sep 2024 10:30 AM GMTగతంలో ఎన్నడూ లేనంత విధంగా అన్నట్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోటీ నుంచి బైడెన్ తప్పుకుని ఆ స్థానంలోకి కమలా హారీస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తర పోరు నడుస్తుందని అంటున్నారు. పైగా... గత కొన్ని రోజులుగా ట్రంప్ పై కమలా హారీస్ పై చేయి సాధిస్తున్నారు!
ప్రధానంగా ఇండో-అమెరికన్లు ఎక్కువగా ఉండే పలు రాష్ట్రాల్లో కమలకు సానుకూల వాతావరణం ఉందని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా... మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు "హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్" అనే సంస్థ వెల్లడించింది. దీంతో... ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అవును... "హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్" అనే సంస్థ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉత్సవ్ సందుజా... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా వంటి కీలక రాష్ట్రాల్లో కమలా హారిస్ కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిననున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... వలస విధానాలు అమలు చేయడంలో డోనాల్డ్ ట్రంప్ పక్కగా ఉంటారని.. ఆయన భారత అనుకూలవాది అని.. నరేంద్ర మోడీతో సంబంధాలను పెంపొందించుకోగలిగారని.. చైనాను భారత్ ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారని.. భారత్ తో సహకారం పెంచుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పుకొచ్చారు.
ఇలా "హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్" అనే సంస్థ కమలా హారీస్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోవడం, ట్రంప్ వల్ల భారత్ కు మేలు అన్నట్లుగా వ్యాఖ్యానించడంతో... ఈ సంస్థ పెద్దల మాటలు ఇండో-అమెరికన్ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ ప్రకటనల అనంతరం విడుదలయ్యే సర్వేల అంచనాలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాలి!