అంబానీ, మిట్టల్ లకు కేంద్రం బిగ్ షాక్!.. మస్క్ ఖుషీ!
ఇందులో భాగంగా... శాటిలైట్ బ్రాండ్ బ్యాండ్ సేవలను వేలం వేయకుండా స్పెక్ట్రమ్ ను కేటాయించాలని కోరింది. మరోపక్క అంబానీ, మిట్టల్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Nov 2024 8:30 PM GMTభారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ లో ఆధిపత్యం కోసం అపర కుబేరుల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా... దేశంలో బ్రాండ్ బ్యాండ్ సేవలతో "స్టార్ లింక్"ను ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తిగా ఉండగా.. ముకేష్ అంబానీ, మిట్టల్ కూడా ఆసక్తి కనబరుస్తూ, దాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా.. భారత్ లో తన స్టార్ లింక్ సేవలను తీసుకొచ్చేందుకు మస్క్ సంస్థ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా... శాటిలైట్ బ్రాండ్ బ్యాండ్ సేవలను వేలం వేయకుండా స్పెక్ట్రమ్ ను కేటాయించాలని కోరింది. మరోపక్క అంబానీ, మిట్టల్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం నుంచి మస్క్ కు అనుగుణంగా నిర్ణయం వచ్చిందని తెలుస్తోంది.
అవును... భారత్ లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను వేలం వేయకుండా స్పెక్ట్రమ్ ను కేటాయించాలని మస్క్ కోరుతుండగా... రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేలం ద్వారానే కేటాయింపులు జరపాలని కోరుకుంటున్నారు. అయితే.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
ఇందులో భాగంగా... ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పెక్ట్రమ్ ను పాలనాపరంగానే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అయితే... ఇంటర్నేషనల్ టెలీ కమ్యునికేషన్స్ యూనియన్ (ఐటీయూ) నిబంధనలను ప్రతీ దేశం పాటించాలని. ఇదే సమయంలో భారత్ లో కేటాయింపులు ఉచితం కాదని, టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ధరను నిర్ణయిస్తుందని తెలిపారు.
కాగా.. శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే... ఉపగ్రహాలు, గ్రౌండ్ స్టేషన్లు మధ్య అనుసంధానం కోసం ఉపయోగించే రేడియో ప్రీక్వెన్సీ. ఇవి... టీవీ ప్రసారాలు, మొబైల్ కమ్యునికేషన్స్, ఇంటర్నెట్ యాక్సెస్ వంటి సేవలను సులబతరం చేయడానికి ఉపయోగపడతాయి! అయితే... అంబానీ ఈ స్పెక్ట్రమ్ వేలం విధానన్ని కోరుతుంటే.. మస్క్ మాత్రం పాలన పరమైన కేటాయింపులు జరపాలని కోరుతున్నారు!
అయితే... ఏ దేశం కూడా శాటిలైట్ స్పెక్ట్రమ్ ను వేలం వేయడం లేదని కేంద్రమంత్రి జోతిరాధిత్య సింధియా స్పష్టం చేశారు. దీంతో... ఇది మస్క్ కు గుడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు!