Begin typing your search above and press return to search.

"పుష్ప-2"నిర్మాణ సంస్థకు బిగ్ షాకిచ్చిన పోలీసులు!

ఇందులో భాగంగా.. ఇప్పటికే ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ ని.. అతని పర్సనల్ మేనేజర్ సంతోష్ ని ఏ12గా.. మరో మేనేజర్ శరత్ బన్నీని ఏ13గా.. పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ రమేష్ ని ఏ14గా చేర్చారు పోలీసులు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 12:34 PM GMT
పుష్ప-2నిర్మాణ సంస్థకు బిగ్  షాకిచ్చిన పోలీసులు!
X

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా.. సోమవారం ఇచ్చిన నోటీసుల మేరకు ఈ రోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. సుమారు 3:30 గంటల పాటు జరిగిన ఈ విచారణలో కీలక ప్రశ్నలు లేవనెత్తారని అంటున్నారు.

ఇందులో భాగంగా... దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ పై పోలీసులు సంధించారని తెలుస్తోంది. పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సైలంట్ గా ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో... ఈ విచారణలో భాగంగా... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమిటనే చర్చా తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా... ఈ కేసును తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప-2 సినిమా నిర్మాణ సంస్థకు పోలీసులు షాకిచ్చారు.

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ ని.. అతని పర్సనల్ మేనేజర్ సంతోష్ ని ఏ12గా.. మరో మేనేజర్ శరత్ బన్నీని ఏ13గా.. పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ రమేష్ ని ఏ14గా చేర్చారు పోలీసులు.

ఇదే సమయంలో... ఏ15గా అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ రాజు ని చేర్చగా... తాజాగా ఏ18గా పుష్పా-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ని చేర్చింది! దీంతో... ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా... సోమవారం నాడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించిన పుష్ప-2 నిర్మాత నవీన్... 50 లక్షల రూపాయల చెక్కును మృతురాలి భర్త, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేసిన సంగతి తెలిసిందే.