Begin typing your search above and press return to search.

మంత్రులకు ఎదురుగాలి వీస్తోందా ?

కేసీయార్ మంత్రివర్గంలోని కొందరికి ఎదురుగాలి వీస్తోందని సమాచారం.

By:  Tupaki Desk   |   10 Sep 2023 5:22 AM GMT
మంత్రులకు ఎదురుగాలి వీస్తోందా ?
X

కేసీయార్ మంత్రివర్గంలోని కొందరికి ఎదురుగాలి వీస్తోందని సమాచారం. మత్రివర్గంలోని ఏడుగురు మంత్రులపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని దీనికి అదనంగా జనాల్లో కూడా వ్యతిరేకత తోడైందని కేసీయార్ కు థర్డ్ పార్టీ నివేదిక అందినట్లు పార్టీలో టాక్. ఈ మంత్రులకు పార్టీ నేతల నుండి ఏమాత్రం సహకారం అందటంలేదని సమాచారం. సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ కు బాగా ఎదురుగాలి ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలోని పరిస్ధితులతో పాటు జనాల మనోభావలను గమనిస్తుంటే వీళ్ళ గెలుపు అనుమానంగానే ఉందట. జనాల్లో కావచ్చు లేదా పార్టీలో కూడా వీళ్ళపై కొంత అసంతృప్తి ఉందని కేసీయార్ ముందే ఊహించారు. అందుకనే నేతలు కాదన్నా వీళ్ళకే టికెట్లు ఇచ్చారు. అయితే కేసీయార్ ఊహించినదానికన్నా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నట్లు తాజా రిపోర్టులు అందింది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా మంత్రులకు గెలుపు కష్టమే అన్నట్లుగా నివేదికలు ఇచ్చిందిట.

దీని ఆధారంగానే మంత్రులతో కేసీయార్ ప్రత్యేకంగా మాట్లాడి జాగ్రత్తలు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమపథకాలు అమలుచేస్తున్నా, జిల్లాల్లో మంత్రులే సుప్రింలుగా ఉన్నా ఎందుకింత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్నది అర్ధంకావటంలేదు. పార్టీవర్గాల సమాచరం ఏమిటంటే అపరిమితమైన అధికారాలు చాలామంది మంత్రుల్లో లెక్కలేనితనం పెరిగిపోయిందట. మద్దతుదారుల్లో కొందరిని మాత్రమే చేరదీయటం, పార్టీలో బాగా కష్టపడే వారిని దూరంగా పెట్టేయటం, పనులు జరగకుండా చూడటం లాంటి అనేక చర్యలతో పార్టీలోనే వీళ్ళపై తీవ్రస్ధాయిలో అసంతృప్తులు పెరిగిపోయినట్లు సమాచారం.

మంత్రుల స్ధానంలో టికెట్లు దక్కించుకోవాలని పోటీపడిన మాజీఎంఎల్ఏలు, గట్టినేతల వల్లే మంత్రులకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సబితకు వ్యతిరేకంగా తీగల కృష్ణారెడ్డి, జగదీష్ రెడ్డికి వ్యతిరకంగా దామోదర్ రెడ్డి, పాటేల్ రమేష్ రెడ్డి, ఎర్రబెల్లికి వ్యతిరేకంగా పార్టీలోని వ్యతిరకుతలతో పాటు కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి, గంగులకు వ్యతిరేకంగా మాజీ, ప్రస్తుత మేయర్లు రవీందర్ సింగ్, సునీల్ రావుతో పాటు కాంగ్రెస్ నుండి బలమైన నేతలు చాలెంజులు విసురుతున్నారు. తలసాని, వేముల, మల్లారెడ్డికి కూడా సొంతపార్టీతో పాటు కాంగ్రెస్ లో బలమైన నేతలతో తలనొప్పులు పెరిగిపోతున్నాయట. చివరకు ఏమవుతుందో ఏమో.