బిగ్ బ్రేకింగ్... కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్... డిమాండ్ ఇదే!
ఈ నేపథ్యంలో తాజాగా గురువారం తెలంగాణ అసెంబ్లీ ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీఆరెస్స్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు!
By: Tupaki Desk | 1 Aug 2024 9:20 AM GMTబడ్జెట్ సమావేశల నుంచి తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇక బీఆరెస్స్ ఎమ్మెల్యేలు వర్సెస్ కాంగ్రెస్ నేతలు గా సాగుతున్న మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం తెలంగాణ అసెంబ్లీ ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీఆరెస్స్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు!
అవును... తెలంగాణ అసెంబ్లీ ముందు గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా... కేటీఆర్ వెనుక ఉన్న అక్కలు మోసం చేస్తారని, గతంలో తనను మోసం చేసే ఇప్పుడు ఇక్కడ కుర్చున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు మజీ మంత్రి, మహేశ్వరం బీఆరెస్స్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించే అన్నారంటూ అలజడి రేగింది.
ఈ నేపథ్యంలో... సబితా ఇంద్రారెడ్డి గద్గద స్వరంతో మాట్లాడుతు కంటతడి పెట్టుకున్నారు! దీంతో... బీఆరెస్స్ మహిళా సభ్యులను, తెలంగాణ ఆడపడుచులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆరెస్స్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచుల శాపం రేవంత్ కి తగులుతుందంటూ శాపనర్థాలు పెట్టారు!
ఈ సమయంలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేటప్పుడు మైక్ ఇస్తామని స్పీకర్ తెలిపారు. దీంతో బీఅరెస్స్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో... ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పే వరకూ నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో... మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. బీఆరెస్స్ ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. దీంతో... అసెంబ్లీ ముందు రోడ్డుపై బైటాయించిన బీఆరెస్స్ ఎమ్మెల్యేలు.. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో... పోలీసులు రంగంలోకి దిగి, బీఆరెస్స్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇలా అరెస్టైన వారిలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పద్మారావు గౌడ్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనీల్ జాదవ్, మొదలైన వారున్నారు.