Begin typing your search above and press return to search.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ కి బిగ్ షాక్...!?

అయితే ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు మాత్రం విజయనగరం ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 3:35 AM GMT
కేంద్ర మాజీ మంత్రి అశోక్ కి  బిగ్  షాక్...!?
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, చంద్రబాబుని సీఎం చేయడంలో కీలక పాత్రధారి అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత అయిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు టీడీపీ బిగ్ షాక్ ఇచ్చేసిందా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు తొలి జాబితాలో ఎక్కడా సీటు చూపించలేదు. అయితే ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు మాత్రం విజయనగరం ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు.

అయితే అశోక్ విజయనగరం ఎంపీ సీటు కోరుతున్నారు అని వార్తలు వచ్చాయి. ఆయన 2019 మాదిరిగానే తనకూ తన కుమార్తెకు టికెట్లు తెచ్చుకోవాలని చూశారు. తన కుమార్తె అసెంబ్లీకి పోటీ చేస్తే తాను ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకున్నారు.

ఆ విషయమే అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు. అయితే కుమార్తెకు టికెట్ ఇచ్చిన అధినాయకత్వం అశోక్ విషయంలో మాత్రం ఏమీ తేల్చక అలా ఉంచేసింది అని అంటున్నారు. అశోక్ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న విజయనగరం పార్లమెంట్ సీటులో చాలా మంది పేర్లను పరిశీలిస్తోంది అని అంటున్నారు. కిమిడి నాగార్జున పేరు అందులో ఒకటి.

ఆయన మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు. ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకటరావు. ఇలా రాజకీయంగా పలుకుబడి కలిగిన ఫ్యామిలీ కాబట్టి నాగార్జునను పోటీకి దించితే విజయం ఖాయం అని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు ఆయన కాకపోతే గేదెల శ్రీనివాస్ అనే సాఫ్ట్ వేర్ దిగ్గజాన్ని కూడా పోటీకి దించాలని చూస్తున్నారు.

ఆయన తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. అంగబలం అర్ధం బలం నిండుగా ఉన్నా వారు. యువత కోసం తన సొంత సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రాలో బాగా పరిచయాలు ఉన్న ఆయన పోటీ చేస్తే విజయం ఖాయం అని లెక్కలేస్తున్నారుట.

ఇక సామాజిక వర్గ సమీకరణలు చూసుకుంటే ఎమ్మెల్యే సీట్లు రాజులకు ఇచ్చిన టీడీపీ ఎంపీ సీటుని పార్లమెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వబోతోంది అని అంటున్నారు. అలా చూసుకుంటే కనుక అశోక్ కి నో చాన్స్ అని అంటున్నారు.

దానితో పాటుగా ఈసారి ఎన్నికల్లో టికెట్ల ఎంపికలో కొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని చెప్పేస్తున్నారు. అయితే టీడీపీలో బాబు కంటే సీనియర్ గా ఉంటూ ఆయనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్న అశోక్ విషయంలో ఈ నిబంధన ఏమిటి అని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పైగా అశోక్ కి టికెట్ ఇస్తే ఆయన వల్ల పార్టీకే లాభం అని అంటున్నారు.

పక్కన ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి రెండు కంటే ఎక్కువ సీట్లు ఇస్తూ కేవలం అశోక్ విషయంలో ఈ విధానం అనుసరిస్తారా అని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తూంటే ఎంపీ టికెట్ విషయంలో అశోక్ పేరు పరిశీలనలో ఉందా లేదా అంటే డౌట్ అంటున్నారు. అదే కనుక జరిగితే అశోక్ అయిదు దశాబ్దాల రాజకీయ జీవితానికి 2024 లోనె తెర పడిపోతుంది అని అంటున్నారు.

ఆయనను బలవంతంగా రాజకీయంగా పదవీ విరమణ చేయిస్తున్నారు అని అభిమానులు అంటూంటే అశోక్ ని రాజకీయంగా పక్కన పెట్టడం పార్టీకి మంచిదేనా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.