Begin typing your search above and press return to search.

ముచ్చుమర్రి బాలిక కేసు... నిందితుడి మేనమామ అనుమానాస్పద మృతి!?

అవును... ఈ నెల 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆమెపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

By:  Tupaki Desk   |   20 July 2024 7:36 AM GMT
ముచ్చుమర్రి బాలిక కేసు... నిందితుడి మేనమామ అనుమానాస్పద మృతి!?
X

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని మాయం చేసిన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఆ బాలిక మృతదేహం లభ్యం కాలేదు! దీంతో.. చివరి చూపు దక్కుతుందా లేదనే ఆందోళనతో ఆ బాలిక తల్లితండ్రుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది.

ఈ సమయంలో... ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నందికోట్కూరు రూరల్ సీఐ, ముచ్చుమర్రి ఎస్సై ని సస్పెండ్ చేసింది సర్కార్. మరోవైపు... బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తండ్రితండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

ఇదే సమయంలో... సొంతింటి నిర్మాణం, మిగతా పిల్లలు గురుకుల పాఠశాల్లో చదివేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో... ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న హుస్సెన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు చెబుతున్నారు.

అవును... ఈ నెల 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆమెపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో... ఆ బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేసినట్లు చెప్పారు. ఆ తర్వాత పొదల్లో పడవేశారని, మరో చోట పాతిపెట్టారని.. మృతదేహానికి రాళ్లు కట్టి కాలువలో పడెసినట్లు రకరకాల వెర్షన్స్ ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా నంద్యాలలో హుస్సెన్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. బాలిక హత్యాచారం కేసులో ఇతడిని పోలీసులు ఇప్పటికే విచారించినట్లు తెలుతోంది! ఈ నేపథ్యంలో... హుస్సెన్ ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేమైనా జరిగిందా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్ని పోస్టు మార్టంకి తీసుకొచ్చిన సమయంలో హుస్సేన్ ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే... బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పాడేసిన నిందితుల్లో ఒకరి మేనమాన ఈ హుస్సేన్ అని అంటున్నారు. దీంతో... హుస్సెన్ మృతి ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు అయ్యిందని అంటున్నారు! దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!