Begin typing your search above and press return to search.

బీజేపీకి షాక్ ఇచ్చిన కీలక మిత్ర పక్షం

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఆ రాష్ట్రంలో భారీ షాక్ తగిలింది.

By:  Tupaki Desk   |   15 April 2025 5:37 AM
బీజేపీకి షాక్ ఇచ్చిన కీలక మిత్ర పక్షం
X

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఆ రాష్ట్రంలో భారీ షాక్ తగిలింది. ఎన్డీయేలో కీలకంగా ఉన్న రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ గుడ్ బై చెప్పేసింది. ఆ పార్టీ అధినేత పశుపతి కుమార్‌ పాశ్వాన్. తమకు ఎన్డీయేలో అన్యాయం జరుగుతోంది అని ఆరోపిస్తూ తప్పుకున్నారు.

ఆయన ఎవరో కాదు కేంద్ర రాజకీయాల్లో ఒకనాడు కీలకంగా వ్యవహరించిన మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు. ప్రస్తుతం బీహార్ లో లోక్ జనశక్తి పార్టీకి చీఫ్ గా ఉంటూ కేంద్రంలో మంత్రిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ కి సొంత బాబాయ్

ఆయన 2019 నుంచి 2024 మధ్యలో కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కలేదు. అబ్బాయి కి ఎండీయే పెద్దలు మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు.

దాంతో చాలా కాలంగా రగిలిపోతున్న ఆయన ఇపుడు సరైన సమయం చూసుకుని షాక్ తినిపించారు అని అంటున్నారు. ఇక బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాశ్వాన్ తో పోటీ పడుతున్న సొంత బాబాయ్ పశుపతి కుమార్‌ పాశ్వాన్ దళిత సామాజిక వర్గంలో గుర్తింపుని కలిగి ఉన్నారు.

ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తన సోదరుడు పార్టీ రాజకీయం తన సొంతం అనుకున్న ఆయనకు చిరాగ్ పాశ్వాన్ రూపంలో వారసత్వం పోటీ ఎదురైంది. అయితే బీజేపీ కూడా చిరాగ్ వైపే ఉండడం ఆయనకు మద్దతు ఇవ్వడంతో పశుపతి కుమార్ పాశ్వాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లఒ బీహార్ లోని మొత్తం 243 స్థానాలకు తాము పోటీ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే పశుపతి కుమార్ పాశ్వాన్ ఆయన పార్టీకి ఏకైక ఎంపీ. దాంతో కేంద్రంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీహార్ లో ఏమైనా ఆయన వల్ల నష్టం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

బీహార్ లో దళితుల అసెంబ్లీ సెగ్మెంట్లు ఎక్కువ. పైగా ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షల నుంచి తీవ్ర పోటీ ఉంది. ప్రతీ ఓటూ ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. దాంతో ఎంపీగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన పశుపతి కుమార్ పాశ్వాన్ ఎంతో కొంత ప్రభావం కొన్ని చోట్ల చూపించినా ఓట్ల చీలిక జరిగి ఆ మేరకు ఎండీయే కూటమికి ఇబ్బంది వస్తుందా అన్న చర్చ అయితే ఉంది.

అయితే బీహార్ లో దళితులు మైనారిటీలు తమ వైపే అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. ఈసారి ఎన్డీయేని ఓడిస్తామని వచ్చేది ఇండియా కూటమే అని వారు చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా బీహార్ లో ఒక వికెట్ పడింది. శుభమా అని ఎన్నికలకు వెళ్తున్న వేళ ఈ పరిణామం ఏ విధంగా ఉంటుందో అన్నది అంతా చర్చిస్తున్నారు.