Begin typing your search above and press return to search.

వైరల్ పిక్... సన్నాఫ్ ఇమ్రాన్ హష్మీ - సన్నీ లియోన్!

ప్రపంచంలో ఏమూలైనా రొటీన్ కి కాస్త భిన్నమైన అంశం కానీ, కాస్త ఆశ్చర్యకరమైన అంశంకానీ వెలుగులోకి వస్తే అది నెట్టింట వైరల్ గా మారిపోతుంటుంది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 11:30 PM GMT
వైరల్  పిక్... సన్నాఫ్  ఇమ్రాన్  హష్మీ - సన్నీ లియోన్!
X

ఈ సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఏ మూల ఎలాంటి కాస్త ఆశ్చర్యకరమైన, మరికాస్త నమ్మశక్యంకాని విషయం విషయం జరిగినా వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైపోతుంటుంది. ప్రపంచం మొత్తం తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలో నెట్టింట వైరల్ గా మారిపోతుంటుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

అవును... ప్రపంచంలో ఏమూలైనా రొటీన్ కి కాస్త భిన్నమైన అంశం కానీ, కాస్త ఆశ్చర్యకరమైన అంశంకానీ వెలుగులోకి వస్తే అది నెట్టింట వైరల్ గా మారిపోతుంటుంది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆ విషయం తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ విద్యార్థికి చెందిన ఎగ్జామినేషన్ ఫారం షీట్ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కారణం... అతడి పేరెంట్స్ పేర్లకు ఉన్న ఫాలోయింగే!!

వివరాళ్లోకి వెళ్తే... ముజాఫర్ పూర్ కి చెందిన ఓ డిగ్రీ కాలేజీలో బీఏ ఆనర్స్ చదువుతున్నాడు ఓ విద్యార్థి! ఈ సమయంలో ఇన్ స్టా గ్రామ్ లో అతడికి చెందిన ఎగ్జాం ఫారం తెగ హల్ చల్ చే స్తోంది. అందుకు కారణం తల్లి తండ్రులు కాలమ్ లో పొందుపరిచిన పేర్లు.. సెలబ్రెటీలవి కావడమే. అక్కడ తండ్రి పేరు ఇమ్రాన్ హష్మీ అని ఉండగా.. తల్లి పేరు సన్నీ లియోన్ అని రాసి ఉంది.

ఇవి బాలీవుడ్ ప్రముఖవనే సంగతి తెలిసిందే. దీంతో ఆ పేర్లు ఉన్న కాలంస్ ని మార్క్ చేసి, ఆ ఎగ్జామినేషన్ ఫారం పిక్ ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ పోస్ట్ కి కామెంట్స్ సెక్షన్ లో నెటిజన్లు క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఇందులో భాగంగా... తాత పేరు మహేష్ భట్? అని ఒకరు ప్రశ్నించగా.. ఇది ఫేక్ ఫామ్ అయ్యి ఉంటుందని మరొకరు స్పందించారు. ఏది ఏమైనా... ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.