గర్భం రాకుండా ఎలా చేయాలంటే... అసెంబ్లీలో ఓపెన్ అయిన సీఎం!
అవును... జనాభా నియంత్రణ సాధ్యం కావాలంటే మహిళలకు విద్య ఎంత అవసరమో చెబుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
By: Tupaki Desk | 8 Nov 2023 4:10 AM GMTఅసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయాలు అని అంటారు. అక్కడ మాట్లాడే ప్రతీ మాట చరిత్ర పుటల్లో రికార్డ్ అవుతాయని, అక్కడ ప్రతీ నాయకుడూ నడుచుకునే తీరు భావితరాల నేతలకు ఆదర్శమవుతాయని చెబుతారు. అయినప్పటికీ... అసెంబ్లీలో ఫోన్ చేతపట్టి అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారంటూ పలు సంఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా అసెంబ్లీలో నితీష్ కుమార్ అసభ్యకరమైన మాటలు మాట్లాడారు!!
అవును... జనాభా నియంత్రణ సాధ్యం కావాలంటే మహిళలకు విద్య ఎంత అవసరమో చెబుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందులో భాగంగా... "షాదీకే బాద్ పురుష్ రోజ్ రాత్ కర్తేహేనా" అని అంటూ.. భార్య చదువుకున్నదైతే గర్భం దాల్చకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసునంటూ ఓ 'బీ గ్రేడ్ మాట' అన్నారు! శృంగారం జరిగే చివర్లో 'బయటకు తీసేయాలి' అనే విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు!
ఈ మాటతో నవ్వే వారు నవ్వితే... ఛీ అని భావిస్తూ అసౌకర్యానికి గురైన వారు ఇంకొందరు! దీనికి సంబంధించిన వీడియో కాసేపట్లోనే వైరల్ గా మారింది. మరోపక్క ఆ వీడియోని షేర్ చేస్తూ బీజేపీ నేతలు నితీష్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. అడల్ట్ "బి" గ్రేడ్ సినిమాల పురుగు నితీష్ బాబు మనసులోకి ఎక్కిందంటూ విమర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మహిళలను అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ అంటుంటే... సీఎం నితీష్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు. పాఠశాలల్లో లైంగిక విద్యలో భాగంగా విద్యార్థులకు ఇలాంటి అంశాలనే బోధిస్తారని గుర్తు చేశారు! అయితే... కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతు దేవి సైతం నితీష్ కు మద్దతు పలికారు!
ఈ సమయలో నితీష్ మాట్లాడిన మాటల వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బీహార్ బీజేపీ... "నితీష్ బాబు లాంటి అసభ్యకరమైన నాయకుడు భారత రాజకీయాల్లో కనిపించడు. అడల్ట్ 'బి'గ్రేడ్ సినిమాల పురుగు నితీష్ బాబు మనసులోకి ఎక్కింది. బహిరంగ ప్రదేశాల్లో వారి డబుల్ మీనింగ్ డైలాగులపై నిషేధం విధించాలి" అని ట్వీట్ చేసింది!
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క బిహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరగనున్నాయి.