లక్కీ బిజిలీ... ఓలాలో ఉద్యోగం కొట్టేసిన శునకం!
ఓలా లో "బిజిలీ" అనే శునకానికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు ఆ సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. అందుకు సంబంధించిన ఐడీ కార్డును ఆయన ట్విటర్ లో పోస్టు చేశారు.
By: Tupaki Desk | 2 Aug 2023 7:07 AM GMTప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ "ఓలా" ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ఉద్యోగి జాయిన్ అయ్యింది. పేరు బిజిలి. ఈ మేరకు బిజిలీ కి సంబంధించిన అధికారిక ఐడీ కార్డు, ఇతర వివరాలను "ఓలా" సీఈవో భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. బిజిలీ అనేది మనిషి కాదు... ఒక శునకం!
అవును... ఓలా లో "బిజిలీ" అనే శునకానికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు ఆ సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. అందుకు సంబంధించిన ఐడీ కార్డును ఆయన ట్విటర్ లో పోస్టు చేశారు. హిందీలో "బిజిలీ" అంటే విద్యుత్తు అనే అర్థం వస్తుంది. అలాగే ఉద్యోగి గుర్తింపు సంఖ్యను "440 వీ"గా పేర్కొన్నారు.
గుర్తింపు కార్డు పై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు ఆఫీసు అడ్రస్ ను ముద్రించారు. కొరమంగళ శాఖలో భవీశ్ అగర్వాల్ కార్యాలయం లో ఆ శునకం పనిచేస్తోందని పేర్కొన్నారు. దానికి మరింత ఫన్ జోడిస్తూ బిజిలీ ని "స్లాక్" ద్వారా సహోద్యోగులు కమ్యూనికేట్ చేయవచ్చని పేర్కొన్నారు.
అక్కడపనిచేసే ఉద్యోగులు సంస్థలో అంతర్గత సమాచార మార్పిడికి ఉయోగించే వ్యవస్థ పేరు "స్లాక్"! అంతే కాదు బిజ్లీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ను "బీఏ" కార్యాలయంగా ముద్రించారు. బిజిలీ ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకోవాలంటే.. అడ్రస్ హోసూర్ రోడ్ లోని ఓలా ఎలక్ట్రిక్ కార్యాలయంగా కార్డులో పేర్కొన్నారన్నమాట.
ఈ సందర్భంగా ఎవరి క్రియేటివిటీకి వారు పనిచేబుతూ... ఆన్ లైన్ లో కామెంట్లు, షేర్ లతో చెలరేగిపోతున్నారు నెటిజన్లు. బిజిలీ తనకు పేరు నచ్చిందని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే... తమ కుక్కల కు సైతం ఇలాంటి ఉద్యోగం కావాల ని మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.
కాగా... ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఆఫీస్ లో కుక్కల పై పోస్ట్ లను షేర్ చేయడం ఇది తొలిసారి కాదు. ఇటీవల ఓలా కార్యాలయంలో సోఫాల పై నిద్రిస్తున్న మూడు కుక్కల ఫొటో ను షేర్ చేశారు. గతేడాది ఆఫీసు లో కుక్కతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు!