Begin typing your search above and press return to search.

ఆమెకు 60, ఆయనకు 67... సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అంటున్న బిల్ గేట్స్!

ఇందులో భాగంగా... పాలాహర్డ్ తన సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అని బిల్ గేట్స్ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 7:30 PM GMT
ఆమెకు 60, ఆయనకు 67... సీరియస్  గర్ల్  ఫ్రెండ్  అంటున్న బిల్  గేట్స్!
X

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వక్తిగత జీవిత విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్న పాలాహర్డ్ గురించి ఆసక్తిగర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... పాలాహర్డ్ తన సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అని బిల్ గేట్స్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు.

అవును... బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... పాలాహర్డ్ లాంటి వ్యక్తి దొరకడం తన అదృష్టమని అన్నారు. ఇద్దరం కలిసి టోర్నీలకు వెళ్తుంటామని.. కలిసి పనులు చేసుకుంటామని తెలిపారు.

కాగా... 67 ఏళ్ల బిల్ గేట్స్ 2021లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క 60 ఏళ్ల పాలాహర్డ్ భర్త ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ 2019 అక్టోబర్ లో క్యాన్సర్ తో మరణించారు. ఇక ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో 2022 బిల్ గేట్స్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదే క్రమంలో.. 2024లో ఒలింపిక్స్ ను ఇద్దరూ కలిసి వీక్షించారు. నాటి నుంచి వీరి రిలేషన్ షిప్ పై రకరకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన తన తాజా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. ఇందులో భాగంగానే ఆమె తన సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిపారు.

ఆ సంగతి అలా ఉంటే... సోర్స్ కోడ్ - మై బిగినింగ్స్ పేరిట బిల్ గేట్స్ తీసుకొచ్చిన పుస్తకంలో తన జీవిత విశేషాలను, అందులోని కీలక అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీన్ని మూడు పుస్తకాలుగా తీసుకొస్తున్నారు. ఈ వాల్యూం-1 లో బాల్యం నాటి సంగతులు, డ్రగ్స్ తో ప్రయోగం వంటి పలు విషయాలను ప్రస్థావించారు.

ఇందులో భాగంగా.. తనకు చిన్నతనంలో ఆటిజం సమస్య ఉండేదని. ఆ సమస్య నుంచి బయట పడేయడం కోసం తన అమ్మానాన్నలు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెబుతూ.. వారు పడిన ఆరాటాన్ని వివరించారు.