బిల్ గేట్స్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నారా ?
బిల్ గేట్స్ అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయన సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నారో జగద్విదితమే.
By: Tupaki Desk | 21 March 2025 1:00 AM ISTబిల్ గేట్స్ అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయన సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నారో జగద్విదితమే. ఆయన సాధించని విజయాలు లేవు. ఆయన చూడని ఎత్తులు లేవు. ఆయన ఇంత చేసినా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనకు ప్రపంచంలో ఎక్కువగా భారత్ అంటే ఇష్టం.
అది ఆయన మాటలలో చేతలలో చర్యలలో కూడా ఎప్పటికప్పుడు బయట పడుతూ వస్తోంది. ఆయన భారత దేశం అంటే ఎందుకు ఇష్టం అంటే అక్కడ గ్రామీణ వాతావరణం గురించి అని అంటారు. అలాగే దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆయన ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తూ వస్తున్నారు.
ఇక వీలు దొరికితే చాలు ఆయన భారత్ కి వస్తూంటారు. అలా భారత్ మీద ప్రత్యేక ప్రేమను చూపిస్తున్న బిల్ గేట్స్ గురించి ఇపుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బిల్ గేట్స్ భారతదేశంలో స్థిరపడతారు అన్నదే ఆ చర్చ.
అంతే కాదు ఆయన ఏకంగా హైదరాబాద్ లో నివాసం ఉంటారు అన్నది మరో చర్చ. ఈ దేశంలో పాతికేళ్ల క్రితమే బిల్ గేట్స్ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పేరుతో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి నాంది పలికారు. అలా ఆనాడే ఆయన హైదరాబాద్ పట్ల మక్కువ కనబరచారు అని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మమకారం అభిమానం దేశం మీద హైదరాబాద్ ప్రాంతం మీద మరింతగా పెరుగుతూ వస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ తన మిగిలిన జీవితం అంతా భారత్ లోనే గడపాలని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఆయనకు భారతీయ సంస్కృతి బాగా నచ్చింది అని అంటున్నారు. భారత దేశం పట్ల ఆయన మోజు పడడానికి అనేక రీజన్స్ లో ఇది ప్రధానమైనది అని చెప్పుకుంటున్నారు.
ఆయన భారత దేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఆయన ఆలోచనా విధానానికి భారత దేశం తగినది అని భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఆయన సన్నిహితులు ఆయన గురించి అనుకుంటున్నది ఏంటి అంటే ఆయనకు భారత దేశ వాతావరణం ఇక్కడ పరిస్థితులు బాగా నచ్చాయని అంటున్నారు.
దాంతో ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టించుకుని ఇక్కడే స్థిరపడిపోతారని అంటున్నారు. అంతే కాదు ఆయన ఇక మీదట గ్రామీణ భారతం అంతా తిరుగుతూ తనదైన శైలిలో సేవలు అందిస్తారని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బిల్ గేట్స్ అంతటి వారు భారత్ పట్ల మోజు పడి తానుగా రావడం, అందునా తెలుగు రాష్ట్రాలలో తన నివాసాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం కనుక జరిగితే అది నిజంగా అదృష్టమే అని చెప్పాలి. ఆయన ఆలోచనలతో ఈ దేశంలో అనేక రంగాలలో కీలక మార్పులను తీసుకుని రావచ్చు అని అంతా అంటున్నారు.
మరో వైపు చూస్తే నిజంగా బిల్ గేట్స్ వంటి వారు భారత్ ని ఇష్టపడి వస్తే కనుక అది భారత్ నుంచి ఇతర దేశాలకు వలస పోతున్న మేధో సంపత్తి కి సరైన జవాబుగా నిలుస్తుందని అంటున్నారు. భారత్ లోని మానవ వనరులు మేధస్సుని ఇక్కడే వాడుకునేలా రేపటి తరానికి ఆయన ఒక స్పూర్తిదాయకంగా నిలుస్తారని కూడా అంటున్నారు. ఈ ఆలోచనలు ఈ చర్చలు ఫలవంతమై బిల్ గేట్స్ ఇక్కడికే రావాలని అంతా మనసారా కోరుకుంటున్నారు.