Begin typing your search above and press return to search.

25 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఎంఎస్ ఆఫీసుకు బిల్‌ గేట్స్‌!

ఈ సందర్భంగా... మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఈ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది!

By:  Tupaki Desk   |   28 Feb 2024 12:47 PM GMT
25 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌  ఎంఎస్  ఆఫీసుకు  బిల్‌  గేట్స్‌!
X

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్, పరోపకారి బిల్ గేట్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒడిశాలోని మురికివాడల్లో పర్యటించి, అక్కడ నివసిస్తున్న వారి జీవన పరిస్థితులను, ఇటీవల వారి పరిస్థితుల్లో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో హైదరాబద్ లోని ఆఫీసును బిల్ గేట్స్ సందర్శించారు.

అవును... సరిగ్గా పాతికేళ్ల క్రితం 1998లో హైదరాబాద్ లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ ని తాజాగా బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా... మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఈ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది! ఈ క్రమంలో ఈ ఐడీసీ సెంటర్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... ఈ సెంటర్ కి బిల్ గేట్స్ స్వయంగా రావడంపై ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐడీసీలోని ఇంజినీర్లను ఉద్దేశించి బిల్ గేట్స్ చేసిన ప్రసంగం గొప్పదని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో... మైక్రోసాఫ్ట్ సంస్థలో విండోస్, అజూర్, బింగ్, ఆఫీస్, కోపిలాట్ సహా ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లోనూ మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ ముఖ్య కేంద్రం కానుందని తెలిపారు.

భువనేశ్వర్ లోని మురికివాడల్లో బిల్ గేట్స్..!:

మరోపక్క బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి బిల్ గేట్స్ అక్కడి మురికి వాడలను సందర్శించారు. ఇందులో భాగంగా మా మంగళ బస్తీలోని బిజూ ఆదర్శ్ కాలనీలో పర్యటిస్తూ.. అక్కడి నివాసితులతో మట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల జీవన స్థితిగతులను, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో మహిళా స్వయం శక్తి సంఘ సభ్యులతో మాట్లాడారు!