Begin typing your search above and press return to search.

ట్రంప్ వేడుకలో బిలియనీర్లు... లక్షల కోట్లు ఒకే ఫ్రేమ్ లో ప్రత్యక్షం!

ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన నలుగురు కుబేరుల సంపద వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:30 PM GMT
ట్రంప్  వేడుకలో బిలియనీర్లు... లక్షల కోట్లు ఒకే ఫ్రేమ్  లో ప్రత్యక్షం!
X

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో ఈ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన నలుగురు కుబేరుల సంపద వైరల్ గా మారింది.

అవును... అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు హాజరయ్యారు. వీరిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించగా.. ఈ పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ నలుగురి నికర ఆదాయం 950 బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.82 లక్షల కోట్లన్న మాట. వీరిలో ప్రపంచ కుబేరుడు ఒక్క ఎలాన్ మస్క్ సంపదే 433.9 బిలియన్ డాలర్లు కాగా... జెఫ్ బెజోస్ సంపద $239.4 బిలియన్లు, జుకర్ బర్గ్ సంపద $211.8 బిలియన్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది.

వీరితో పాటు ఎల్.వి.ఎం.హెచ్. మోయిట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ లగ్జరీ సామ్రాజ్య అధిపతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన కుబేరుడు అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ కూడా తన కుమారుడు అలేగ్జాండ్రేతో కలిసి ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈయన సంపద ఫోర్బ్స్ అంచనా ప్రకారం 179.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదే సమయంలో... భారతదేశంలోని అత్యంత సంపన్నుడు, 98.1 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ముకేశ్ అంబానీ, సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు చెబుతుండగా.. 4.7 బిలియన్ డాలర్ల విలువైన లాస్ వెగాస్ క్యాసినో ఎగ్జిక్యూటివ్, ట్రంప్ ఫ్రెండ్ ఫిల్ రఫీన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... 1.5 బిలియన్ డాలర్ల సంపద కలిగిన హోవార్డ్ లుట్నిక్, 1 బిలియన్ డాలర్ ఆదాయం సంపద కలిగిన వివేక్ రామస్వామితో పాటు పలువురు బిలియనీర్లు వారి వారి జీవిత భాగస్వాములతో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కనిపించారు.