Begin typing your search above and press return to search.

ఏమిటీ బయలాజికల్ ఏజ్? మెదుడు ఆరోగ్యానికి చిట్కాలివే

వయసు శరీరానికే కానీ మనసుకు కాదన్న నానుడి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని మరో కోణంలో చెబుతూ అందరిలోనూ ఆసక్తిని నింపుతుననారు డాక్టర్ లెరోయ్ హుడ్

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:30 AM GMT
ఏమిటీ బయలాజికల్ ఏజ్? మెదుడు ఆరోగ్యానికి చిట్కాలివే
X

వయసు శరీరానికే కానీ మనసుకు కాదన్న నానుడి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని మరో కోణంలో చెబుతూ అందరిలోనూ ఆసక్తిని నింపుతుననారు డాక్టర్ లెరోయ్ హుడ్. ఎవరీ పెద్దమనిషి అంటే.. ప్రపంచంలోనే అత్యంత కీలక వైద్యుల్లో ఒకరు. అమెరికాకు చెందిన ఈ పెద్దాయన తాజాగా హైదరాబాద్ కు వచ్చారు. ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ ఆవిష్కర్తగా ఆయనకున్న పేరు ఒక ఎత్తు అయితే.. మనిషి జీవితంలో మెదడు పోషించే కీలక పాత్రకు సంబంధించి ఆయన చెప్పే మాటలు.. మెదడును చురుగ్గా ఉంచుకోవటానికి ఆయన ఇచ్చే చిట్కాల్ని చదివిన తర్వాత.. ప్రతి ఒక్కరు వాటిల్లో కొన్ని అంశాల్ని అయినా ఫాలో కావాలని ఫిక్స్ కావటం ఖాయం.

మెదడు ఆరోగ్యంపై ఫోకస్ చేస్తే.. వయసు ఏ మాత్రం పెద్ద సమస్య కాదని ఆయన స్పష్టం చేస్తారు. తన వాస్తవిక వయసు 82 ఏళ్లు అయినప్పటికీ.. తన బయలాజికల్ వయసు మాత్రం 65 ఏళ్లు మాత్రమేనని చెబుతారు. మెదడును ఆరోగ్యంగా ఉంచటం.. నియంత్రణ పద్దతుల్ని పాటిస్తూ.. శారీరక వ్యాయామాన్ని చేయటం ద్వారా శరీర వయసుతో పోలిస్తే బయలాజికల్ వయసును తక్కువగా చేసుకోవచ్చని చెబుతారు.

30 ఏళ్ల తర్వాత మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని.. 80 ఏళ్లకు మరింత క్షీణిస్తుందని చెప్పే హుడ్.. పెద్ద వయసులో ఉన్న వారు తమ మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవటానికి కొన్ని చిట్కాల్ని పాటించాల్సిన అవసరం ఉందని చెబుతారు. పాత కార్లను డ్రైవింగ్ మెదడుకు మంచి వ్యాయామంగా చెబుతారు. వాహనాన్ని నడపటంతోమెదడు పని తీరును మెరుగుపరుస్తుందని చెప్పిన ఆయన మరికొన్ని చిట్కాలు చెబుతారు.

- గుంజీలు తీయటం

- ఏరోబిక్స్ తో సహా పలు వ్యాయామాలు చేయాలి

- వ్యాయామంతో మెదుడు కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. మెదడు సామర్థ్యం పెరుగుతుంది.

- దేనినైనా నేరుగా కాకుండా ఓపక్క నుంచి చూడాలి

- ఫజిల్స్ నింపాలి

- ఆహార అలవాట్లు కూడా మెదడు సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

- రోజువారీగా తీసుకునే ఆహారంలో అధిక ఫైబర్.. కాయగూరలు.. పండ్లు ఉండేలా చూసుకోవాలి. నట్స్ కూడా అవసరం.

- మద్యం.. రెడ్ మీట్ తక్కువగా తీసుకోవాలి.

- మధ్యాహ్నా.. రాత్రి భోజనానికి మధ్య కనీసం ఎనిమిది గంటల గ్యాప్ ఉండాలి.

- రాత్రి ఎక్కువగా భోజనం చేస్తే తర్వాతి ఉదయం టిఫిన్ తినకుండా టీ లేదా కాఫీ సరిపోతుంది.