Begin typing your search above and press return to search.

సిల్వర్ ను 'బీట్' చేసింది..ప్రపంచంలో 8వ అతిపెద్ద సంపద బిట్ కాయిన్

ఒకవిధంగా చూస్తే.. అప్పుడు 1.38 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న వెండి విలువ కంటే ఎక్కువనే.

By:  Tupaki Desk   |   12 Nov 2024 7:30 PM GMT
సిల్వర్ ను బీట్ చేసింది..ప్రపంచంలో 8వ అతిపెద్ద సంపద బిట్ కాయిన్
X

తనకు అలవాటైన రీతిలో బిట్ కాయిన్ ప్రకంపనలు రేపుతోంది. గత మార్చిలో ఈ క్రిప్టో కరెన్సీ దిగ్గజం ఐదు రోజుల్లో నాలుగుసార్లు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. అప్పట్లో తొలిసారి 73 వేల డాలర్ల మార్క్ ను అధిగమించింది. నాడు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించడంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆశ్చర్యకర రీతిలో 1.42 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఒకవిధంగా చూస్తే.. అప్పుడు 1.38 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న వెండి విలువ కంటే ఎక్కువనే.

కారణమిదే..

గత ఆర్థిక సంవత్సరం చివర్లో బిట్ కాయిన్ ఈ స్థాయిలో ర్యాలీ చేయడానికి కారణం.. జనవరి 11న అమెరికాలో స్పాట్ బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ను ప్రారంభించడం. బ్లాక్ రాక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్ మెంట్ వంటి ఫైనాన్షియల్ కంపెనీల నేతృత్వంలో ఈ ఈటీఎఫ్ లు ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దీంతో బిటా కాయిన్ కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగాయి.

అమెరికా ప్రభావంతో..

అప్పట్లో అమెరికాలో సానుకూల ప్రభావం ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. దీంతో బిట్ కాయిన్ కు డిమాండ్ ఊపందుకుంది. బిట్ కాయిన్, ఈథర్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్ దరఖాస్తులను పరిశీలించేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో సంప్రదాయ ఫైనాన్షియల్ మార్కెట్లో క్రిప్టో కరెన్సీలను అంగీకరించేందుకు మరో ఆర్థిక వ్యవస్థ సిద్ధం అవుతోంది. థాయి లాండ్ కూడా విదేశీ క్రిప్టో ఈటీఎఫ్ లను యాక్సెస్ చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లకు అనుమతి ఇస్తామని తెలిపింది.

మరోసారి జూలు విదిల్చి

ఆర్థిక పరిణామాల కారణంగానే బిట్ కాయిన్ ధర పెరగడం లేదు. బిట్‌ కాయిన్ ఈటీఎఫ్‌లకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) ఆమోదం లభించడం, రాబోయే బిట్‌కాయిన్ హాల్వింగ్ వంటి ఇటీవలి మైలురాళ్ళు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై ఆసక్తిని రేకెత్తించాయి. పెట్టుబడిదారులు, అనుభవజ్ఞులైన, కొత్తవారు, క్రిప్టో వైపు తరలివస్తున్నారు. ఈ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా బిట్ కాయిన్ సిల్వర్ ను ‘బీట్’ చేసింది. 1.752 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలో 8వ అతిపెద్ద సంపదగా బిట్ కాయిన్ అవతరించింది. 1.726 ట్రిలియన్ డాలర్లతో సిల్వర్ ను దాటేసింది. 24 గంటల వ్యవధిలోనే బిట్ కాయిన్ 9 శాతం పెరిగింది. 88,570 డాలర్లకు చేరింది. దిగ్గజ సంస్థలు (మెటా 1.472 ట్రిలియన్ డాలర్లు), (టెస్లా 1.124 ట్రిలియన్ డాలర్లు), బెర్క్ షైర్ హాత్ వే (1.007 ట్రిలియన్ డాలర్లు) కంటే.. బిట్ కాయిన్ విలువే అధికం కావడం విశేషం.