Begin typing your search above and press return to search.

బీహార్ సీఎం బీజేపీదే...నితీష్ కి నో చాన్స్ ?

ఇక నితీష్ కుమార్ ని జాతీయ రాజకీయాల్లోకి తెచ్చి కేంద్రంలో మంత్రిగా చేసి ఆయన గౌరవానికి భంగం కలుగకుండా చూడాలన్నది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది అని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 4:30 PM GMT
బీహార్ సీఎం బీజేపీదే...నితీష్ కి నో చాన్స్ ?
X

బీజేపీ నానాటికీ జాతీయ స్థాయిలో బలపడడం ప్రత్యర్ధులకే కాదు ఎన్డీయే మిత్రులకు కూడా కొంత కలవరం కలిగించే పరిణామంగా చూస్తున్నారు. ఎన్డీయేకు రెండు పార్టీలు కీలక మద్దతుని ఇస్తున్నాయి. ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఎన్డీయే సర్కార్ కి చెరో వైపునా కొమ్ము కాస్తున్నాయి.

అయితే ఇపుడు ఎండీయే మిత్రులకు ఎంతవరకూ తమ డిమాండ్లు కేంద్రం నుంచి సాధించుకునే చాన్స్ ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. కాషాయ ప్రభంజనం దేశమంతా కనిపిస్తున్న వేళ బీజేపీ బలం గట్టిగా ఉందని సంకేతాలు కనిపిస్తున్న వేళ మిత్రులు సైతం కాస్తాంత పరిమితులతోనే వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ లో బీహార్ లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అది స్పష్టం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు, బీజేపీకి బీహార్ సీఎం అన్నది ఒక కల. అది దశాబ్దాల నాటిది. ఉత్తరాదిన అన్ని రాష్ట్రాలలో సీఎం సీటుని అధిరోహించిన బీజేపీకి బీహార్ కల మాత్రం సాకారం కావడం లేదు ఈసారి ఎనికల్లో తప్పకుండా దానిని నెరవేర్చు కుంటుందని అంటున్నారు.

బీహార్ లో బీజేపీ జేడీయూ ఘటబంధన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు కలసి అధికారంలో ఉన్నాయి. తక్కువ సీట్లు 2020 ఎన్నికల్లో జేడీయూకి వచ్చినా బీజేపీకి 80 దాకా సీట్లు లభించి అతి పెద్ద పార్టీగా ఉన్నా కూడా బీహార్ సీఎం పీఠాన్ని నితీష్ కుమార్ కే ఇచ్చింది. అది రాజకీయంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం.

ప్రత్యర్ధి శిబిరం ఆనాటికి బలంగా ఉంది కాబట్టి జేడీయూకి వేరే ఆప్షన్లు కనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీ కాస్తా తగ్గి వ్యవహరించింది. ఇపుడు అలాంటి స్థితి అయితే లేదు అన్నబి బీజేపీ భావన. ఇండియా కూటమి వీక్ గా ఉంది. దాంతో పాటు నితీష్ ఆ వైపుగా వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు.

దేశంలో అపరిమితమైన అధికారాలతో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేతో కలసి ముందుకు సాగడం అన్నది అందులోని మిత్రులకు ఒక రాజకీయ అనివార్యంగా కూడా ఉంది. ఇక ఇపుడు బీజేపీ ఇదే అదనుగా చేసుకుని తన రాజకీయ ఆకాక్షణలను నెరవేర్చుకునేందుకు చూస్తుంది అని అంటున్నారు. ఈసారి కూడా బీజేపీ బీహార్ లో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది అన్నది తెలిసిందే.

దాంతో పాటు జేడీయూని మిత్రుడిగా చేసుకుని బరిలోకి దిగుతుంది. రేపటి రోజున ఎన్నికల్లో ఈండీయే కూటమి గెలిస్తే కనుక బీహార్ కి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని అంటున్నారు. ఈసారి ఎటువంటి రాజీలూ బహుశా బీజేపీ నుంచి ఉండబోవని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని జేడీయూకి ఇవ్వడం ద్వారా మహారాష్ట్ర ఫార్ములాను అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఇక నితీష్ కుమార్ ని జాతీయ రాజకీయాల్లోకి తెచ్చి కేంద్రంలో మంత్రిగా చేసి ఆయన గౌరవానికి భంగం కలుగకుండా చూడాలన్నది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ రకమైన ప్రతిపాదనలకు నితీష్ కుమార్ ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ కి బీహార్ లో అత్యధిక కాలం సీఎం గా పనిచేసిన రికార్డు ఉంది. ఆయన స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారు.

కేంద్రంలో మంత్రిగా అంటే ఆయన తన అనుభవానికి ఉప ప్రధాని పదవితో పాటు టాప్ ఫైవ్ పోర్టుఫోలియోలలొప ఒక దానిని కోరుకోవచ్చు అని అంటున్నారు. అయితే బీజేపీ ఆయన ప్రతిపాదనలు అంగీకరిస్తుందా అన్నది కూడా చర్చగా ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఎపుడూ అనివార్యతలదే పెద్ద పీట. మరో ఎనిమిది నెలలలో జరిగే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఇదే తీరున అత్యధిక స్థానాల్లో పోటీ చేసి మ్యాజిక్ మార్క్ కి దగ్గరగా వస్తే మాత్రం బీహార్ కి తొలి బీజేపీ సీఎం గా ఆ పార్టీని కాదనే వారు ఎవరూ ఉండరని అంటున్నారు.