జమిలి వస్తే ప్రాంతీయ పార్టీలు బంద్ ?
అయితే బీజేపీ జమిలి ఎన్నికలు పెదితే ఈ హిస్టరీ కలిగిన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందే అని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Jan 2025 7:30 AM GMTదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ పట్టుదల. ఆ విషయంలో బీజేపీ ఎక్కడికీ తగ్గదు. అసలు ఒకటి అంటే బీజేపీకి చాలా ఇష్టం. ఒకే దేశం ఒకే పన్ను అని జీఎస్టీని తెచ్చింది ఒకే నేషన్ ఒకే రేషన్ అని మరోటి తెచ్చింది. దేశమంతా ఒక్కటే అనడం వరకూ బాగానే ఉన్నా భారత్ లో భిన్నత్వం ఉంది. అది ఏకత్వం వైపుగా సాగినా ఎవరి భావాలు ఎవరి ఆలోచనలూ వారికి ఉంటాయి.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆలోచనలు. ఆ విధంగా అనేక ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకుని నేటికీ మేటిగా రాజకీయాలల్లో జాతీయ పార్టీల సరిసాటిగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో డీఎంకే చరిత్ర ఎంభై ఏళ్ళు ఉంటే అన్నా డీఎంకే చరిత్ర అర్ధ శతాబ్దం ఉంది. ఏపీలో టీడీపీ హిస్టరీ ఫార్టీ ఇయర్స్ దాటేసింది. తెలంగాణాలో గులాబీ పార్టీ పాతికేళ్ల ప్రస్తానానికి చేరువ అవుతోంది. ఏపీలో మరో పార్టీ వైసీపీ పుట్టి దశాబ్దన్నర అవుతోంది. జనసేన పదేళ్ళు పై దాటేసింది.
ఇక శివసేనవంటి పార్టీలు చూస్తే షష్టి పూర్తికి దగ్గరలో ఉన్నాయి. కర్ణాటక్లో దేవేగౌడా జేడీఎస్ వంటి వాటికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంఐఎం లాంటి పార్టీలు తీసుకున్నా ఘనమైనవే. మాయావతి మమతా బెనర్జీ పార్టీలు కానీ ఆప్ కానీ శరద్ పవార్ పార్టీ కానీ ఇవన్నీ దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నాయి. ఇక బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ అయితే దశాబ్దాల హిస్టరీ తనదే అంటోంది.ఆర్జేడీ ది మూడున్నర దశాబ్దాల పై మాట. యూపీలో ఎస్పీకీ అంతే హిస్టరీ ఉన్నది.
అయితే బీజేపీ జమిలి ఎన్నికలు పెదితే ఈ హిస్టరీ కలిగిన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందే అని అంటున్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ అయిన బీవీ రాఘవులు అయితే ప్రాంతీయ పార్టీలు ఇప్పటికైనా ఆలోచించి జమిలి బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని అంటున్నారు.
బీజేపీ ఏదో విధంగా చిన్నా చితకా పార్టీలను మచ్చిక చేసుకుని జమిలి బిల్లుని పార్లమెంట్ లో నెగ్గించుకునే ప్రయత్నంలో ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. దాని కోసం 189వ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన అన్నారు. ఆ దిశగా బీజేపీ ప్రయత్నాలు అయితే గట్టిగా సాగుతున్నాయని అన్నారు.
ఒక్కసారి కనుక జమిలి బిల్లుకు ఆమోదముద్ర పడితే కనుక ప్రాంతీయ పార్టీలకు చెల్లు అని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు ఒకే త్రాటి మీదకు వచ్చి జమిలి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన జమిలికి జై కొడుతున్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ కూడా జమిలి ఎన్నికల విషయంలో బయటకు ఏమీ మాట్లాడడం లేదు, ఆ మౌనం వెనక వ్యూహం ఏమిటో తెలియదు. బీజేపీ అయితే సెలెక్ట్ కమిటీకి బిల్లుని పంపించినా సరైన టైం చూసుకుని బిల్లుని పార్లమెంట్ ముందుకు తెస్తుందని అంటున్నారు. బహుశా అది బడ్జెట్ సెషన్ లో కావచ్చు అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం బీజేపీ జమిలి ఆమోదం పొందడం ఖాయం. అపుడు ప్రాంతీయ పార్టీలకు ఉనికి దెబ్బ తింటుందా ఏమో. ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలేమో.