జమిలికి బీజేపీ నిజంగా సిద్ధమేనా ?
ఎందుకు ఈ మాట అంటే బీజేపీకి 2024 ఎన్నికల్లోనే పూర్తి మెజారిటీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కి అచ్చంగా 32 సీట్లు తగ్గాయి.
By: Tupaki Desk | 6 Dec 2024 3:49 AM GMTఎందుకు ఈ మాట అంటే బీజేపీకి 2024 ఎన్నికల్లోనే పూర్తి మెజారిటీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కి అచ్చంగా 32 సీట్లు తగ్గాయి. ఒక వైపు టీడీపీ చంద్రబాబు మద్దతు మరో వైపు జేడీయూ నితీష్ కుమార్ సపోర్టుతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు చూస్తే కాశ్మీర్ పోయింది, హర్యానా దక్కింది. జార్ఖండ్ లో పరాజయం పాలు అయ్యారు. మహారాష్ట్రలో బీభత్సంగా గెలుపు బావుటా ఎగరేశారు.
ఇక జమిలి ఎన్నికలు అంటే ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే కమలదళంలో ఉండే అవకాశం కచ్చితంగా ఉంది అని అంటున్నారు. బీజేపీకి ఇపుడు వచ్చిన ఈ మెజారిటీని కాపాడుకుంటూ 2029 దాకా ఈ అధికారాన్ని దక్కించుకుంటూ మూడు టెర్ములు ముచ్చటగా పూఅర్తి చేసి అప్పుడు జమిలి ఎన్నికలకు వెళ్ళేందుకు చూస్తుంది అన్న మాట కూడా ఉంది.
ఇక బీజేపీకి గుండెకాయ లాంటి యూపీలో అంతకంతకు ఎస్పీ విజృంభిస్తోంది. ఉప ఎన్నికల్లో కొన్ని సీట్లు అధికంగా బీజేపీకి వస్తే రావచ్చు. ఎందుకంటే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి. ఎక్కడ అధికారంలో పార్టీ ఉన్నా వారికి ఉప ఎన్నికల్లో సానుకూలత ఉంటుంది.
అయితే జనరల్ ఎన్నికల్లో మాత్రం జనాల తీర్పు వేరే విధంగా ఉండవచ్చు. మహారాష్ట్రలో ఎంపీ సీట్లలో మకా వికాస్ అఘాడీ గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం మహా వికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలే కారణం. కానీ యూపీలో ఆ సీన్ లేదు. ఎస్పీయే పెద్ద పార్టీ. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని దిగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన సీట్లలోనే పోటీ చేస్తుంది. కాదనేది కూడా ఉండదు.
అందువల్ల కనుక చూసుకుంటే యూపీలో అంతా సొలోగానే వ్యవహారం ఉంటుంది అని అంటున్నారు. దాంతో పాటు అఖిలేష్ యాదవ్ కి ఇమేజ్ పెరుగుతోంది. అలా ఎస్పీ గ్రాఫ్ కూడా బాగానే ఉంటోంది. దాంతో జమిలి ఎన్నికలు అంటే రెండేళ్ల ముందే టెస్ట్ చేసుకుని బరిలోకి దిగితే బీజేపీకి రాజకీయ లాభం లేకపోగా ఇబ్బంది వస్తే అపుడు సంగతేంటి అన్న చర్చ కూడా ఉంది.
అన్నింటికీ మించి బీజేపీకి మహారాష్ట్రలో అద్భుతమైన తీర్పు వచ్చింది. 133 సీట్లలో సొంతంగా బీజేపీ గెలిచి ఉంది. అయిదేళ్ల పాలనకు తిరుగులేని విధంగా మెజారిటీ వచ్చింది. దాంతో ఇంత మెజారిటీని కాలదన్నుకుని మళ్లీ జమిలిలో మహారాష్ట్రను కూడా కలిపేసి ఎన్నికలకు వెళ్తారు అని ఎవరూ అనుకోరు అని అంటున్నారు
అలాగే హర్యానా కానీ ఇతర రాష్ట్రాలలో కానీ బీజేపీ తనకు దక్కిన అధికారాన్ని ప్రజలు ఇచ్చిన మాండేట్ ని కాదని జమిలి ఎన్నికల వైపు చూడదనే అంటున్నారు. అయితే బీజేపీకి జమిలి ఎన్నికలు అంటే ఇష్టమే. దాని కోసం ఆ పార్టీ 2029లో ప్లాన్ చేయవచ్చు అని అంటున్నారు.
ఈసారి జమిలి ఎన్నికలతో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలను కలుపుకుని వెళ్ళి 2029లో మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని ఆ విధంగా నెరవేర్చుకోవాలని చూడవచ్చు అన్నది వినిపిస్తున్న మాట. అందుకే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కూడా జమిలి ఎన్నికల విషయంలో ఏపీ ఉండదని చెప్పేశారు. నిజానికి అవి జరుగుతాయో లేదో అన్నది కూడా ఉండబట్టే బాబు అలా అన్నారని అంటున్నారు. సో బీజేపీ మాత్రం చేతిలో ఉన్న అధికారాన్ని వదులుకుని రిస్క్ చేయదనే అంటున్నారు.