చిన్నమ్మ సమాధానం చెప్పుకోలేక పోతున్నారా...!
బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందట.
By: Tupaki Desk | 13 Oct 2024 10:30 AM GMTబీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందట. ఔను.. నిజమే. బీజేపీ అధిష్టానం.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిరంతరం ఆరా తీస్తున్న విషయం తెలిసిం దే. ఒకవేళ.. ఆరా తీయకపోయినా.. ఇక్కడున్న సీనియర్ కమల వేగులు.. కేంద్రానికి ఎప్పటికప్పుడు ఉప్పందిస్తున్నారు. దీంతో ఏపీలో నాయకుల గురించి పక్కా సమాచారం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. ఏపీలో బీజేపీ పరిస్థితి వేరు.
ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఒక్క ఏపీలో తప్ప. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. తమిళనాడులోడీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఇక, ఏపీలో మాత్రమే కూటమి సర్కారు రూపంలో బీజేపీ కూడా అధికారం పంచుకుంది. దీంతో ఇక్కడ బీజేపీని జాగ్రత్తగా అబ్జర్వు చేస్తున్నారు. భవిష్యత్తులో చాలా వ్యూహాలు ఉన్న నేపథ్యంలో బీజేపీకి మరక అంటకుండా కూడా చేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఇద్దరు కీలక నాయకులు నగ్న వీడియోలతో పట్టుబడ్డారు.
ఈ పరిణామం బీజేపీని అంతర్గతంగా కుదిపేసింది. మరోవైపు.. చంద్రబాబును వెనుకేసుకు వస్తూ.. సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలను పురందేశ్వరి మీడియా ముందే తప్పుబట్టారు. ఈ మూడు అంశాలను కూడా బీజేపీ తీవ్రంగా భావిస్తోంది. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి పురందేశ్వ రికి పెను ప్రమాదం తప్పింది. కానీ, బీజేపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విషయంలో కేంద్ర పెద్దలే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో పురందేశ్వరి వ్యాఖ్యలు కేంద్ర పెద్దలకు మంటపుట్టిస్తున్నాయి.
మరోవైపు. నగ్న వీడియోలతో నాయకులు హల్చల్ చేయడం తెలిసిందే. వారిని హుటాహుటిన పార్టీ నుం చి సస్పెండ్ చేసినా.. పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్‌గానే ఉంది. అసలు ఈ వీడియోలు లీకైన విధానంపైనే ప్రశ్నిస్తుండడం గమనార్హం. దీంతో పురందేశ్వరికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌కి బాధ్యతలు అప్పగించారని.. నేడో రేపో ఆయన ఏపీకి వచ్చి పురందేశ్వరి నుంచి వివరణ తీసుకుంటారని తెలుస్తోంది.