పురందేశ్వరికి బీజేపీ పెద్దల షాక్.. మ్యాటర్ ఇదే...!
బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ పెద్దల నుంచి షాకింగ్ న్యూస్ వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 2:30 PM GMTబీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ పెద్దల నుంచి షాకింగ్ న్యూస్ వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. రెండు రీజన్లపై బీజేపీ పెద్దలు ఆమెను ప్రశ్నించారని తెలిసింది. కొన్నాళ్ల కిందట.. పురందేశ్వరికి వ్యతిరేకంగా ఓ వర్గం బీజేపీ నాయకులు కేంద్రం పెద్దలకు ఫిర్యాదులు చేశారు. అయితే.. అప్పట్లో నే దీనిపై చర్చ సాగినా.. పురందేశ్వరి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు కేంద్రం పెద్దలు .. ఈ విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం.
ప్రధానంగా పార్టీ సభ్యత్వాల విషయంలో పురందేశ్వరి జోక్యం నామమాత్రంగా ఉందనేది పార్టీ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దరిమిలా.. టీడీపీ,జనసేన పార్టీల సభ్యత్వాలతో పోలుస్తూ.. బీజేపీకి ఎందుకు ఊపు తీసుకురాలేక పోతున్నారని.. కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ జాతీయ సారథిగా ఉన్న నడ్డా ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 54 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది.
అదేవిధంగా జనసేన కూడా.. రూ.500లకు సభ్యత్వం ఇస్తున్నా.. అనేక మంది పార్టీలో చేరారు. ఈ రెండు విషయాలను కంపేర్ చేస్తే.. 2 లక్షల మందితో కూడా బీజేపీ సభ్యత్వం చేయించలేక పోవడం.. పురందే శ్వరికి మైనస్ అయింది. ఆమె గతంలో రెండు సార్లు విన్నవించినప్పుడు.. రెండు సార్లూ సభ్యత్వాలకు సమయం పెంచారు. కానీ, ఆమె నేరుగా సభ్యత్వాల విషయంలో జోక్యం చేసుకోలేక పోయారు. తన సొంత పనులపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో సభ్యత్వాల నమోదు మందగించింది.
ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకున్న బీజేపీ పెద్దలు.. పురందేశ్వరిని ప్రశ్నించారు. ఈ సమయంలోనే గతంలో పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుల విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ప్రధానంగా సీనియర్ నాయకులతో కలివిడి లేకపోవడం.. వారికి అందుబాటులో ఉండకపోవడం వంటివి ఆమెకుప్రధాన అవరోధంగా మారాయి. ఈ రెండు విషయాలను సరిచేసుకోవాలని చెబుతూ.. సభ్యత్వాలను 5 లక్షలకు తీసుకువెళ్లాలని తాజాగా తేల్చి చెప్పారట. మరి చిన్నమ్మ ఏం చేస్తారో చూడాలి.