Begin typing your search above and press return to search.

బీజేపీ డెసిషన్ టైం : బాబుకు మద్దతుగానా లేక...?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది డెసిషన్ టైం గా ఉంది. ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని టీడీపీ కూటమి ప్రభుత్వం బాహాటంగానే ఆరోపిస్తోంది

By:  Tupaki Desk   |   3 Oct 2024 12:30 AM GMT
బీజేపీ డెసిషన్ టైం :  బాబుకు మద్దతుగానా లేక...?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది డెసిషన్ టైం గా ఉంది. ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని టీడీపీ కూటమి ప్రభుత్వం బాహాటంగానే ఆరోపిస్తోంది. ఒకటికి పది సార్లు అదే చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అదే చెబుతూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో సిట్ ని ఏపీ ప్రభుత్వం విచారణ కోసం వేసింది. అయితే సిట్ విచారణతో సరిపోతుందా లేక కేంద్రం ఏమైనా విచారిస్తుందా అన్న దాని మీద సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ ని ప్రశ్నించింది. కేంద్రం అభిప్రాయం కనుక్కోమని చెప్పింది. ఈ నెల 3న మళ్ళీ తిరిగి ఈ కేసు విచారించే సమయానికి కేంద్రం అభిప్రాయం ఏమిటో తెలియనుంది.

ఇక సిట్ విచారణతో సరి అని చంద్రబాబు అండ్ కో ఇప్పటికే గట్టి పట్టుదల మీద ఉన్నారు అయితే సిట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది కాబట్టి అసలైన వివరాలు బయటకు రావు అని వైసీపీ అంటోంది. అందుకే న్యాయ విచారణ కానీ సీబీఐ విచారణ కానీ జరిపించాలని కోరుతోంది.

ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నేరుగా ప్రధానికి సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కేంద్రం తన మౌనాన్ని వీడి ఒక డెసిషన్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. కేంద్రం ఈ విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంది. సిట్ ఓకే అంటే ఏపీ ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నట్లు అవుతుంది. అయితే సిట్ విచారణకు ముందే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ కల్తీ అయింది అని చెప్పి ఉన్నారు మరి దాని కంటే సిట్ ఏమి తేలుస్తుంది అన్న మాట కూడా ఉంది. దాంతో చాలా విషయాలూ అనుమానాలు కూడా అలాగే జనం మదిలో ఉండిపోతాయని కూడా అంటున్నారు

పై పెచ్చు ఇది కేవలం ఏపీకి సంబంధించిన అంశం కాదు ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులతో ముడిపడి ఉన్న అంశం. అంతే కాదు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద సీరియస్ కామెంట్స్ చేసింది. మరి అలాంటపుడు కేంద్రం సిట్ విచారణకు ఓకే అని చెప్పి ఊరుకుంటే అది ఏ మేరకు సమంజసంగా ఉంటుందో అన్నది కూడా ఆలోచించుకోవాలని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీజేపీ ధార్మిక వ్యవస్థల పట్ల కడు భక్తిగా ఉంటుంది. హిందూత్వ బీజేపీ నినాదం, అందువల్ల బీజేపీ ఈ విషయంలో తన కమిట్మెంట్ ని చిత్తశుద్ధిని కూడా చాటుకోవాల్సి ఉంటుంది. అలాంటపుడు రాజకీయ లెక్కల కంటే తన ఫిలాసఫీకే పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది.

దాంతో సీబీఐ విచారణ జరిపించి ఈ కేసులో మొత్తం వ్యవహారాలను నిగ్గు తేలుస్తామని కేంద్రం అంటే కనుక హిందూ భక్త కోటిలో హర్షం వెల్లువెత్తుంది. మరి అదే సమయంలో అది వైసీపీకి రాజకీయంగా అనుకూలంగా మారుతుంది. టీడీపీ కూటమికి ఇబ్బంది అవుతుంది.

మరి బీజేపీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, కోర్టుకు ఏమి చెబుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా లడ్డూ వివాదం శృతి మించిన వేళ కూడా మౌనంగా ఉంటూ తనదైన శైలిలో అంతా చిత్తగిస్తూ వస్తున్న బీజేపీకి ఇపుడు సుప్రీంకోర్టు లో ఏమి చెప్పాలనంది మాత్రం ఒక విధంగా కష్టతరమైన వ్యవహారమే అని అంటున్నారు.