Begin typing your search above and press return to search.

ఏపీలో రాజకీయ తులాబారం...జగన్ ఉండాల్సిందేనా ?

ఏపీ పాలిటిక్స్ బహు చిత్రంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని కొత్త ట్రెండ్స్ ట్రెడిషన్స్ ఏపీలోనే క్రియేట్ అయి రాచపుండు మాదిరిగా తయారయ్యాయి.

By:  Tupaki Desk   |   20 Feb 2025 3:37 AM GMT
ఏపీలో రాజకీయ తులాబారం...జగన్ ఉండాల్సిందేనా ?
X

ఏపీ పాలిటిక్స్ బహు చిత్రంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని కొత్త ట్రెండ్స్ ట్రెడిషన్స్ ఏపీలోనే క్రియేట్ అయి రాచపుండు మాదిరిగా తయారయ్యాయి. ఇక్కడ పార్టీల మధ్య ఉన్నది నిఖార్సు అయిన రాజకీయ శతృత్వం అన్నది బయట లోకం అనుకుంటుంది. అనుకోవడమేంటి సీన్ అలాగే ఉంటుంది.

అధికార ప్రతిపక్షాలు ప్రత్యర్థులుగా ఉండవు. శత్రు భావనతోనే ఉంటారు. ఒకరిని ఒకరు కలుసుకోరు. పలకరించుకోరు. రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం పార్టీలలో కూడా ఎదురు బొదురుగా తారసపడరు. ఆగస్టు పదిహేను గణతంత్ర వేడులల్లో కలసి పాల్గొనరు. ఇక ప్రజా సమస్యల మీద ఒకే మాట అన్నది లేనే లేదు.

అంతలా పార్టీల మధ్య పేరుకుపోయిన రాజకీయ శతృత్వం మూలంగా ఏపీకి నష్టమే జరుగుతోంది. లేకపోతే విభజన హామీలలో ఏవీ పదేళ్ళు దాటినా అమలు కాకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాపీగానే ఉంటోంది. ఏపీలోని రాజకీయాలు మరచి అంతా ఒక్కటిగా కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి ఉంది.

ఈ రకమైన పరిస్థితులను వినియోగించుకుంటూ కేంద్రంలో బీజేపీ తన పాలను హాయిగా సాగిస్తోంది. ఎవరు ఏపీ నుంచి గెలిచినా పాతిక మంది ఎంపీలూ బీజేపీ ఖాతాలోనే అన్న రాజకీయ విశ్లేషకుల మాటలే నిజం అన్నట్లుగానే పరిస్థితి ఉంటోంది.

మరో వైపు నుంచి చూస్తే కనుక 2014 నుంచి 2018 దాకా బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంటూనే జగన్ తోనూ పరోక్ష స్నేహం నెరిపింది అన్నది ఉంది. ఆ తరువాత 2019 నుంచి 2024 వరకూ వైసీపీ బీజేపీల మధ్య తెర వెనక బంధం ఉంది. అపుడు టీడీపీని సైడ్ చేసినట్లుగా ఉంచినా చివరికి మళ్లీ ఆ పార్టీతోనే బీజేపీ దోస్తీ కట్టి 2024 ఎన్నికల్లో గెలిచింది.

ఇక ఇపుడు కూటమి బయట జగన్ ఉన్నారు. అయినా కానీ ఏపీలో ఇండియా కూటమి బలపడడం లేదు కాలొ మోపడం లేదు. ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలసి వైసీపీ ఎన్డీయే కూటమికి ఆల్టరేషన్ గా ఇండియా కూటమిని కట్టవచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. అంటే వైసీపీ న్యూట్రల్ గా ఉన్నా బీజేపీతో మళ్ళీ తెర వెనక అయినా చేయి కలవకపోతుందా అన్నది చూస్తూ ఉండాలని అంటున్నారు.

ఇక బీజేపీ సైతం జగన్ విషయంలో మరీ దూకుడుగా ఉండటం లేదు అని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీ తీసుకున్నా వైసీపీకి పోయేది ఏమీ లేదు కానీ అధినాయకుడు జగన్ విషయంలో ఆయన కేసుల విషయంలో దూకుడు చేస్తేనే అది కూటమికి లాభం, వైసీపీకి భారీ నష్టం.

మరి ఆ పని బీజేపీ పెద్దలు చేసి పెడతారా అన్నదే చర్చగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడచిపోతున్నాయి. జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ఆయన మీద కేసులు చాలానే ఉన్నాయి. వాటికి ముందు బెయిల్ మీద ఆయన ఉన్నారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. అలా చేయాలన్నది కూటమిలోని పార్టీల కోరిక ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు అభిమానులు అదే కోరుకుంటున్నారు.

కానీ బీజేపీ ఆ పని చేస్తుందా అన్నదే చర్చ. ఇక్కడ కూటమికి యాంటీగా జగన్ ఉండడం అంటే బీజేపీకి కూడా ఆయన ప్రత్యర్ధే. కానీ విషయం అది కాదు ఏపీలోని రాజకీయ తులాబారంలో జగన్ ని ఇబ్బంది పెడితే బీజేపీకి వచ్చే లాభం కంటే టీడీపీకి జరిగే మేలు అధికంగా ఉంటుంది. అపుడు ఏపీలో రాజకీయమే ఏకపక్షం అవుతుంది.

ఆ విధంగా చేయడం వల్ల టీడీపీ ఫుల్ ఫ్రీడం తో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అపుడు తమకు ఇబ్బంది కదా అన్న ఆలోచనలు ఏమైనా బీజేపీ పెద్దలలో ఉన్నాయా అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అందుకే ఇద్దరు బద్ధ శత్రువులు ఒకరికి ఒకరుగా ఎదురు నిలిపి తనదైన రాజకీయం ఏపీలో బీజేపీ చేస్తూ తన రాజకీయ పంట పండించుకుంటోందని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలో వైసీపీని ఇబ్బంది పెడితే వైసీపీ రాజకీయం బలహీనంగా అయితే అది బీజేపీకి లాభం కానే కాదు, వైసీపీ ఓటు బ్యాంక్ అంతా తిరిగి కాంగ్రెస్ కి మళ్ళుతుంది. అపుడి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో బలోపేతం అయినా జాతీయ స్థాయిలో తమకు తలపోటుగా మారుతుంది. అందువల్ల కాంగ్రెస్ వీక్ గా ఏపీలో ఉండాలీ అంటే వైసీపీ అక్కడ ఉండి తీరాలీ అని అంటున్నారు. ఈ రకమైన రాజకీయ సమీకరణల వల్లనే వైసీపీకి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా పోతోందా అన్న చర్చ అయితే ఉంది మరి.