Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికల జెండా బీజేపీ అజెండా ?

ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నది బీజేపీ నినాదం. దేశంలోని లోక్ సభతో పాటు అసెంబ్లీలకు అలాగే స్థానిక సంస్థలకూ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 3:35 AM GMT
జమిలి ఎన్నికల జెండా బీజేపీ అజెండా ?
X

దేశంలో వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంది. దాంతో బీజేపీ తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కోటీ తీస్తోంది. జనసంఘ్ కాలం నాటి నుంచి బీజేపీకి కొన్ని విధానాలు ఉన్నాయి. అవి డిమాండ్లుగా మారినా కాలం కలసి రాక ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇపుడు అయితే అలా కాదు బీజేపీ పట్టిందల్లా బంగారమే అందుకే బీజేపీ జమిలి ఎన్నికల డిమాండుని సాకారం చేసుకునే పనిలో పడింది.

ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నది బీజేపీ నినాదం. దేశంలోని లోక్ సభతో పాటు అసెంబ్లీలకు అలాగే స్థానిక సంస్థలకూ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది. దీని వల్ల దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగి ఆదాయం ఖర్చు కాలం అన్నీ ఆదా అవుతాయని ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి ఆగదని అలాగే ఎంతసేపూ ఎన్నికల ప్రచారాలు రాజేఎయాలతో పార్టీల మధ్య సఖ్యత లేక అభివృద్ధి విషయంలో కలసి రాకుండా పోతున్నాయని భావిస్తోంది.

ఇదిలా ఉంటే శీతాకాల సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బీజేపీ దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించింది. అక్కడ నుంచి తిరిగి పార్లమెంట్ కి ఈ బిల్లు వస్తుంది. బడ్జెట్ సమావేశాలు రెండవ సెషన్ మార్చి నుంచి మొదలై ఏప్రిల్ దాకా సాగుతాయి. ఆ మధ్యలో జమిలి బిల్లుని సభలో ప్రవేశపెట్టాలని చూస్తోంది.

ఈ లోగా లోక్ సభ రాజ్యసభలలో మెజారిటీని సరిచూసుకుంటోంది. లోక్ సభలో 360 మంది దాకా ఎంపీలు ఉంటే బిల్లు ఆమోదం పొందుతుంది. ఎన్డీయేకు మూడు వందల మంది దాకా ఉన్నారు. అయితే జమిలికి వైసీపీ లాంటి పార్టీల మద్దతు ఉంటుంది. అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎంపీలను కూడా ఈ వైపుగా ఆకట్టుకునే పనిలో ఉన్నారని అంటున్నారు.

మొత్తానికి లోక్ సభలో రాజ్యసభలో జమిలి బిల్లు ఆమోదం పొందితే ఆ తరువాత దేశంలోని 14 రాష్ట్రాల అసెంబ్లీలలో బిల్లు ఆమోదం పొందాలి. ఇపుడు చూస్తే బీజేపీ ఎన్డీయే మిత్రులతో కలిసి 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అందువల్ల ఆ పని కూడా సులువుగా సాగుతుందని అంటున్నారు.

దాంతో 2027 ఫిబ్రవరిలో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ముహూర్తంగా పెట్టుకుంది అని తెలుస్తోంది. ఈ ఏడాది బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత దేశంలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉండవని అంటున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులకు 2026 అర్ధభాగంలో ఎన్నికలు ఉన్నాయి. వాటిని 2027 జమిలిలో కలుపుతారు అని అంటున్నారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నికలు అయిన అన్ని రాష్ట్రాలలో మధ్యంతర ఎన్నికలు ఖాయం. అలా చూస్తే ఢిల్లీతో సైతం అని చెప్పాలి. ఒకే పార్టీ ఓకే ఎన్నిక పేరుతో జాతీయ స్థాయిలో అంశాలను ప్రచారంలోకి తీసుకుని రావడం ద్వారా కాంగ్రెస్ మధ్యేవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఈ దెబ్బతో పక్కకు నెట్టి దేశమంతా గెలవాలని బీజేపీ చూస్తోంది. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దాని కంటే ముందు జరిగిన హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయంతో బీజేపీకి జమిలి ఎన్నికల మీద గొప్ప ధైర్యం వచ్చేసింది అని అంటున్నారు.