Begin typing your search above and press return to search.

అదానీ ఇష్యూలో కాంగ్రెస్ దూకుడు.. మధ్యలోకి జగన్ ని లాగిన బీజేపీ!

ఈ సమయంలో అదానీని విషయంలో తమను తాము సమర్థించుకోవడం ఏమో కానీ.. జగన్ ను మధ్యలోకి లాగిందనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 10:46 AM GMT
అదానీ ఇష్యూలో కాంగ్రెస్  దూకుడు.. మధ్యలోకి జగన్  ని లాగిన బీజేపీ!
X

అదానీ గ్రూపు సంస్థ ఛైర్మన్, భారత బిలియనీర్ గౌతం అదానీపై అమెరికాలో లంచం, మోసంకు సంబంధించిన కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ అంశం బీజేపీ – కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ సమయంలో బీజేపీని కాంగ్రెస్ గట్టిగా తగులుకుంది.

ప్రధాని మోడీకి అదానీకి ఉన్న సంబంధం ఇదంటూ తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తోంది. మరోపక్క అదానీ గ్రూపు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో... అదానీ అరెస్ట్ కారని, ఆయనపై విచారణ జరగదని.. అందుకు కారణం ప్రధాని మోడీ అని రాహుల్ వ్యాఖ్యనించారు.

మోడీ - అదానీల బంధం భారత్ లో ఉన్నంత వరకూ సురక్షితమనేనని.. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ దోచుకుంటున్నాడని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ తనదైన శైలిలో స్పందించింది. ఈ సమయంలో అదానీని విషయంలో తమను తాము సమర్థించుకోవడం ఏమో కానీ.. జగన్ ను మధ్యలోకి లాగిందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... అమెరికాలో అదానిపై లంచం, మోసం ఆరోపణలతో కేసు నమోదవ్వడంతో ఒక్కసారిగా ప్రధాని మోడీ, బీజేపీ వైపు వెళ్లు చూపిస్తూ పలు కామెంట్లు తెరపైకి వచ్చాయి. ప్రధాని మోడీ - అదానీలు అవిభక్త కవలలు అనే స్థాయిలో విపక్షాలు, నెటిజన్లు స్పందిస్తున్నారని తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో సీరియస్ గా స్పందించింది.

ఇందులో భాగంగా... బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ మాట్లాడుతూ.. అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఈ.సీ.ఐ)కు 12 గిగావాట్ల విద్యుత్ సరఫా చేసేందుకు భారత కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని.. అంటే.. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో ఎస్.ఈ.సీ.ఐ. ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ లోకి వచ్చిందని అన్నారు.

అయితే... ఈ విద్యుత్ సరఫరా అనేది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రాష్ట్రాల కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపలేదని.. దీంతో అదానీ గ్రూప్ 2021 జూలై నుంచి 22 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు 265 మిలియన్ డాలర్లు ముట్ట చెప్పిందని.. ఆ సమయంలో ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వమే ఉందని ఫైరయ్యారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణల ప్రకరం.. వారు పేర్కొన్న సమయాల్లో ఏపీలో వైసీపీ పాలనే ఉందని.. ఒడిశాలో కాంగ్రెస్ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉందని.. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతు గల డీఎంకే ఉండగా.. ఛత్తిస్ గఢ్ లో కాంగ్రెసే అధికారంలో ఉందని.. అలాటప్పుడు బీజేపీకి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు.

స్పందించిన అదానీ గ్రూప్!:

ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ స్పందించింది. ఇందులో భాగంగా... సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేసింది.