పురందేశ్వరి స్థానంలో కడప నేత.. బీజేపీ వ్యూహం..!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణ యం తీసుకున్నట్టు తెలిసింది.
By: Tupaki Desk | 29 Jan 2025 4:09 AM GMTఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణ యం తీసుకున్నట్టు తెలిసింది. ఆమెను తప్పించి.. కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నాయకుడికి పగ్గాలు అప్పగించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఏపీలో కూటమి సర్కారు రూపంలో పాగా వేసి న బీజేపీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు రెడ్డి నేతను రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఎవరాయన..!
ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడవాలంటే.. రెండు కీలక సామాజిక వర్గాల్లో ఏదొ ఒక దాని వైపు ఉండాలన్న భావన ప్రతి పార్టీలోనూ ఉంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ రెడ్లను నమ్ముకుని వారికే బాధ్యతలు అప్పగించింది. ఇక, బీజేపీ తొలినాళ్లలో కాపులపై ఆధారపడింది. కానీ, అది వర్కవుట్ కాలేదని తెలుసుకున్నాక.. కమ్మలవైపు మొగ్గు చూపి.. పురందేశ్వరికి పగ్గాలు అప్పగించింది. పార్టీ పరంగా ఎలా ఉన్నా.. రాజకీయంగా అధికారం పంచుకునే దిశగా అయితే.. కమల నాథులు ముందుకు రావడంలో పురందేశ్వరి కీలక రోల్ పోషించారు.
ఇక, ఇప్పుడు ఓటు బ్యాంకుపైనే కన్నేసిన బీజేపీ.. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా.. రాష్ట్రంలో పాగా వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే... సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించాలని నిర్ణయించింది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రరెడ్డి ని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. వాస్వానికి అధ్యక్ష పదవి కోసం పార్టీలో పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో తొలి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ లో పనిచేస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డికి పగ్గాలు అప్పగించ డం ద్వారా ఉభయ కుశలోపరిగా.. ఇటుపార్టీ నాయకులకు, అటు.. సామాజిక వర్గంపరంగా కూడా బలమైన సంకేతాలు పంపినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, సింగిరెడ్డి కడప వాసి. పులివెందుల సమీపంలోని వేంపల్లె కు చెందిన ఆయన. 1978 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.