Begin typing your search above and press return to search.

జ‌న‌సేన వ‌ర్సెస్ బీజేపీ అంత‌ర్యుద్ధం..!

ఏపీలో పొత్తు రాజ‌కీయాలు వేడెక్కాయి. జ‌న‌సేనతో పొత్తు పెట్టుకున్నామ‌ని బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతు న్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:30 PM GMT
జ‌న‌సేన వ‌ర్సెస్ బీజేపీ అంత‌ర్యుద్ధం..!
X

ఏపీలో పొత్తు రాజ‌కీయాలు వేడెక్కాయి. జ‌న‌సేనతో పొత్తు పెట్టుకున్నామ‌ని బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతు న్నారు. ఇక‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జ‌న‌సేన కూడా.. తాము బీజేపీతోనే ఉన్నామ‌ని త‌ర చుగా చెబుతోంది. కేంద్రంలోని పెద్ద‌ల‌తోనూ త‌మ‌కు సంబంధాలు ఉన్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు. ఈ పొత్తు విష‌యంలో జ‌న‌సేన క‌న్నా.. బీజేపీ ఎక్కువ‌గానే రియాక్ట్ అయింది. ఎక్క‌డ అవ‌కాశం వ‌చ్చినా.. జ‌న‌సేన‌తోనే త‌మ పొత్తు ఉంటుంద‌ని తేల్చి చెబుతూ వ‌చ్చింది.

త‌ర‌చుగా బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి కూడా త‌మ పొత్తు జ‌న‌సేన‌తోనే కొన‌సాగుతుంద‌ని అంటున్నారు. అయి తే.. ఇలాంటి పొత్తు పార్టీ జ‌న‌సేనకు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌కుండానే బీజేపీ నాయ‌కులు ఒక కీల‌క విష‌యంలో కార్య‌రంగంలోకి దిగడం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. ప‌స్తుతం భార‌త ఎన్నిక‌ల సంఘం అధికారులు.. ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబం ధించి వారు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వివిధ పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లుస్తున్నారు.

ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు కూడా(పురందేశ్వ‌రికాదు) విజ‌య‌వాడ‌లో బ‌స చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొల‌గింపు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించే ప‌ద్ధతులు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓట్ల జాబితాలో మార్పులు త‌దిత‌ర అంశాల‌పై వారు చ‌ర్చించారు. అయితే.. ఈ పార్టీతో పొత్తులో ఉన్న‌జ‌న‌సేనను మాత్రం విస్మ‌రించారు. వాస్త‌వానికి జ‌న‌సేనను స్వ‌యంగా ఎన్నిక‌ల సంఘం పిలిచే అవ‌కాశం లేదు.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఎలాంటి ప్రాతినిధ్యం లేక‌పోవ‌డంతో జ‌న‌సేన‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించ‌లేదు. ఇంకా తాత్కాలిక పార్టీగానే ప‌రిగ‌ణిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో గుర్తింపు పొందిన పార్టీగా, అంత‌కు మించి.. మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ జ‌న‌సేన‌ను క‌లుపుకొని వెళ్ల‌డంలో నిర్ల‌క్ష్యం చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌న‌సేన‌తో తాము క‌లిసి ఉన్నామ‌ని చెబుతున్న పార్టీ.. ఇలా చేయ‌డంపై జ‌న‌సేన నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. త‌మ‌ను వాడుకుని వ‌దిలేయాల‌ని చూస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో మ‌రింత ముసురుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.