చేతులు కలిసినా - మనసులు కలిసేనా... బీజేపీతో టీడీపీ పొత్తు ముచ్చట..!
ఆయన వెంట జనసేనాని పవన్ కూడా వెళ్తున్నారు. మొత్తంగా పొత్తులపై తేల్చేసే తరుణం.. టికెట్ల పంప కాలపై క్లారిటీ వంటివి రానున్నాయి.
By: Tupaki Desk | 22 Feb 2024 9:30 AM GMTచేతులు కలుపుతున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కూడా. కానీ, మనసులు కలిసే నా? క్షేత్రస్థాయిలో కలివిడి సాధ్యమయ్యేనా? ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్న. ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తుల దిశగా అడగులు పడుతున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక నిర్ణయాత్మక వైఖరిని ప్రదర్శించారని.. ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన లకు వెళ్లనున్నారు.
ఆయన వెంట జనసేనాని పవన్ కూడా వెళ్తున్నారు. మొత్తంగా పొత్తులపై తేల్చేసే తరుణం.. టికెట్ల పంప కాలపై క్లారిటీ వంటివి రానున్నాయి. ఇంత వరకు బాగానేఉంది. అసలు కథ.. ముందుందని అంటున్నా రు పరిశీలకులు. ఒకవైపుజనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. ఈ విషయంలో పార్టీ నాయకులను ఒప్పించేందుకు సీట్ల నుంచి తప్పించేందుకు.. నానా ప్రయాస పడుతున్న మాట వాస్తవం. పక్కా టీడీపీ అభిమానులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. కొన్ని స్థానాల్లో నాయకులను బుజ్జగిస్తున్నారు కూడా.
అయినప్పటికీ.. చాలా వరకు జిల్లాల్లో పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపే పరిస్థితి వచ్చింది. అయితే. ఇది చేతులు కలిపినంత మాత్రాన వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని.. మనసులు కలవాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మనసులు కలవాలంటే.. క్షేత్రస్థాయి లో ముందుగా టీడీపీ దానికిసంబంధించి తమ్ముళ్లను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా మరో 10 నుంచి 15 సీట్లను టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటుంది.
దీనికి చంద్రబాబు రెడీగానే ఉన్నా.. నాయకులు సిద్ధంగా లేరనేది వాస్తవం. ``మీరు త్యాగాలు చేస్తారు. మా సంగతి ఏంటి?`` అని వారు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో ఎన్నికలకు కేవలం నెల ముందు మాత్రమే ఇలా పొత్తుల రాగం పలకడంపై కూడా వారు నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా ఆరు మాసాలకు ముందు కూడా.. అందరూ పనిచేయాలని.. నియోజకవర్గాల్లో తిరగాలని చంద్రబాబు చెప్పారు. దీంతోకొందరు తిరిగారు. ఖర్చు కూడా పెట్టుకున్నారు. తమ కేడర్‌ను ముందుండి నడిపించారు. ఇలాంటి వారే ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నారు. ముందు వీరిని బుజ్జగించాల్సిన అవసరం ఉందని అంటున్నారుపరిశీలకులు.