Begin typing your search above and press return to search.

టీడీపీని బీజేపీ అడుగుతున్న సీట్లు ఇవేనా...!?

ఏ రాజకీయ పార్టీకైనా వాస్తవ దృక్పధం ఉండాలి. ప్రజలలతో మీడియాతో మాట్లాడేటపుడు హైప్ క్రియేట్ చేస్తూ మాట్లాడవచ్చు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 3:30 PM GMT
టీడీపీని బీజేపీ అడుగుతున్న సీట్లు ఇవేనా...!?
X

ఏ రాజకీయ పార్టీకైనా వాస్తవ దృక్పధం ఉండాలి. ప్రజలలతో మీడియాతో మాట్లాడేటపుడు హైప్ క్రియేట్ చేస్తూ మాట్లాడవచ్చు. కానీ వారికంటూ ఉన్న సొంత బలం గురించి పూర్తి అవగాహన కచ్చితంగా ఉంటుంది కదా. ఏపీ బీజేపీ ఇపుడు గ్రౌండ్ రియాలిటీస్ ని గమనిస్తోంది. దానికి అనుగుణంగానే పొత్తుల వైపు చూస్తోంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం బీజేపీ ఆలోచిస్తోంది అంటున్నారు. అంతే కాదు అయిదు ఎంపీ సీట్లతో పాటు తొమ్మిది దాకా అసెంబ్లీ సీట్లను బీజేపీ కోరబోతోంది అని అంటున్నారు. 2014లో అయితే బీజేపీకి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాలుగు ఎంపీ పన్నెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు.

ఈసారి మాత్రం ఒక ఎంపీ సీటు అదనంగా బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. అదే టైంలో మూడు అసెంబ్లీ సీట్లను తగ్గించుకుంటోందీని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలో అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యం. అందువల్ల అసెంబ్లీ సీట్ల విషయంలో ఈసారి తగ్గించి ఇవ్వాలనే చూస్తోంది అని అంటున్నారు.

మరో వైపు జనసేన కూడా పొత్తులో ఉంది. ఆ పార్టీకి కూడా అసెంబ్లీ సీట్లు ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో బీజేపీకి తక్కువ సీట్లు ఇస్తారని అంటున్నారు. మరి దాన్ని గమనించే బీజేపీ తొమ్మిది దగ్గర నంబర్ ఉంచిందా అన్న చర్చ సాగుతోంది. ఇక అయిదు ఎంపీ సీటు బీజేపీ కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే కనుక 75 అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తామని అలాగే పన్నెండు దాకా ఎంపీ సీట్లు కోరుతామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఇటీవలే ఒక చానల్ డిబేట్ లో కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి.

కానీ బీజెపీకి ఉన్న అసలు బలం ఏంటి అన్నది చూస్తే కనుక వారు పొత్తు పేరుతో అడుగుతున్న సీట్లే అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో తాము ఎక్కడ ఉన్నామన్నది బీజేపీకి వాస్తవికత అర్థం అయింది అంటున్నారు.

ఒక విధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ తానుగా దిగి వచ్చిందా అన్న చర్చ కూడా నడుస్తొంది. ఏపీలో ఈసారి ఎలాగైనా కొన్ని ఎంపీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో మూడవసారి బీజేపీ అధికారంలోకి రావడం అతి ముఖ్యం. దాంతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని వార్తలు వచ్చినా అవన్నీ కావు అనే అంటున్నారు.

బీజేపీ ఒంటరిగా పోటీ పడితే నోటా కంటే తక్కువ ఓట్లు 2019లో వచ్చాయి. దాంతో ఈసారి కూడా అలాంటి ప్రయోగం చేయబోదని అంటున్నారు. దాంతో అన్ని రకాలుగా ఆలొచించిన మీదటనే బీజేపీ 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లడమే ఉత్తమ మార్గమని భావిసోందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే 2014 ఎన్నికలలో బీజేపీ టీడీపీ పొత్తు కట్టాయి. అపుడు జనసేన మద్దతు ఇచ్చింది. పదేళ్ళ విరామం తరువాత మూడు పార్టీలు మరోసారి పొత్తు పెట్టుకుని ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. అలా తమ ఉమ్మడి ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విపక్ష కూటమి 2024లో విజయం సాధిస్తుందా లేక జగన్ పై చేయి సాధించి కూటమిని ఓడిస్తారా అన్నది మరి కొద్ది నెలలలో తేలనుంది.