బీజేపీ రెండో జాబితా విడుదల... తెలంగాణలో ఆ రెండూ పెండింగ్!
ఇక ఈ 72 మందిలోనూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతాపార్టీ
By: Tupaki Desk | 13 March 2024 6:10 PM GMTసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి సారించింది. కీలక చర్చలు, సర్వే ఫలితాలు, సామాజిక సమీకరణలు.. మొదలైన అంశాలని ప్రాతిపదికగా తీసుకుని తాజాగా రెండో జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా 72 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇక ఈ 72 మందిలోనూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతాపార్టీ!
అవును... భారతీయ జనతాపార్టీ తాజాగా 72 మంది అభ్యర్థులతో తమ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తొలిజాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రెండో జాబితాలో 6గురు అభ్యర్థులను ప్రకటించింది. అంటే... తొలి రెండు జాబితాల్లోనూ కలిసి 15 మంది అభ్యర్థులను ఫైనల్ చేసిందన్నమాట. ఇక మిగిలిన వాటిలో ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది.
ఇలా రెండో జాబితాలో 6గురికి తెలంగాణ నుంచి చోటు దక్కగా... మిగిలిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర నుంచి 20 మంది, కర్ణాటక నుంచి 20 మందిని ఎంపిక చేసింది. ఇక మిగిలినవారిలో గుజరాత్ నుంచి 7గురు, హర్యానా నుంచి 6గురు, మధ్యప్రదేశ్ నుంచి 5గురు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ల నుంచి ఇద్దరిద్దరు, దాద్రా నగర్ హవేలీ నుంచి ఒక్కరిని ఎంపిక చేసింది.
అంటే.. ఈ నెల మొదట్లో 195 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసిన బీజేపీ.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం తొలి రెండు విడతల్లోనూ 267 మంది అభ్యర్థులను ప్రకటించిందన్నమాట.
ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో తెలంగాణనుంచి ఎవరు ఎంపికయ్యారనే విషయం ఇప్పుడు చూద్దాం...!
మెదక్ – రఘునందన్ రావు
ఆదిలాబాద్ - గోడేం నగేశ్
మహబూబాబాద్ - సీతారాం నాయక్
పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
నల్గొండ - శానంపూడి సైదిరెడ్డి
మహబూబ్ నగర్ - డీకే అరుణ లు ఎంపికయ్యారు.
కాగా... వీరిలో సీతారాం నాయక్, శానంపూడి సైదిరెడ్డి, గోడెం నగేశ్ లు ఇటీవలే బీఆరెస్స్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.