Begin typing your search above and press return to search.

అన్ని వయసులో ఓటర్లలో బీజేపీకి డౌన్ ఫాల్ !

బీజేపీ అన్నా మోడీ అన్నా ఊగిపోయి ఓట్లు వేసే వారు అంతా 2024 ఎన్నికల్లో మాత్రం వెనక్కి తగ్గారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:51 AM GMT
అన్ని వయసులో ఓటర్లలో బీజేపీకి డౌన్ ఫాల్ !
X

బీజేపీ అన్నా మోడీ అన్నా ఊగిపోయి ఓట్లు వేసే వారు అంతా 2024 ఎన్నికల్లో మాత్రం వెనక్కి తగ్గారు. ఆ ప్రభావం కచ్చితంగా ఎన్నికల ఫలితాల్లో కనిపించింది 303 ఎంపీ సీట్లను సొంతంగా బీజేపీ 2019లో గెలుచుకుంది. ఇపుడు ఏకంగా 63 సీట్లు తగ్గిపోయాయి అంటేనే ఓటర్లలో మార్పు వచ్చింది అని అర్ధం అవుతోంది.

ఈ నేపధ్యంలో తాజాగా ప్రచారంలో ఉన్న ఒక విశ్లేషణను బట్టి చూస్తే వివిధ వయసులలో ఉన్న ఓటర్లలో బీజేపీ గ్రాఫ్ అలాగే ఓటు షేర్ ఒక్కసారిగా తగ్గింది అని అంటున్నారు. ఆ విధంగా బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అని అంటున్నారు

ఈ వయసుల వారు అంతా 2019లో బీజేపీని హత్తుకున్నారు. నెత్తిన పెట్టుకున్నారు. కమలం తో మేము అంటూ హుషార్ చేశారు. గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి మాత్రం వీరిలో చాలా మంది జారుకున్నారు. అదే టైం లో కాంగ్రెస్ వైపు చాలా మంది టర్న్ అయ్యారు. చూడడానికి ఆసక్తిగానే ఉన్న బీజేపీ దీని మీద సీరియస్ గా ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఇక దేశంలో పాతికేళ్ల లోపు వారిలో 2019లో కాంగ్రెస్ కి 20 శాతం ఓటు షేర్ ఉంటే ఈసారి 21 శాతానికి ఓటు షేర్ పెరిగింది. అదే బీజేపీకి ఆనాడు 40 శాతం ఓటు షేర్ ఉంటే 2024 లో 39 శాతానికి ఓటు షేర్ తగ్గింది. ఇక 26 ఏళ్ళ నుంచి 35 మధ్య వయస్కులైన ఓటర్లలో చూస్తే 2019లో కాంగ్రెస్ కి 20 శాతం ఓటు షేర్ ఉంటే ఇపుడు 21 శాతానికి ఓటు షేర్ పెరిగింది. అలాగే 2019లో బీజేపీకి 39 ఓటు షేర్ ఉంటే 2024 నాటికి అది కాస్తా 37 శాతానికి తగ్గింది అని లెక్కలు చెబుతున్నాయి.

అదే విధంగా 36 నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్కులు అయిన ఓటర్లలో 2019 లో కాంగ్రెస్ కి 20 శాతం ఓటు షేర్ ఉంటే 2024 నాటికి ఆ సంఖ్య కాస్తా 22 శాతానికి పెరిగింది. అలాగే బీజేపీకి 2019లో 37 శాతం ఓటు షేర్ ఉంటే 2024 నాటికి 36 కి శాతానికి తగ్గింది . 46 నుంచి 55 మధ్య వయస్కులైన ఓటర్లలో 2019లో కాంగ్రెస్ కి 20 శాతం ఓటు షేర్ ఉంటే 2024 నాటికి 21 శాతానికి పెరిగింది. అదే బీజేపీకి 2019లో 35 శాతం ఓటు షేర్ ఉంటే 2024 నాటికి 37 శాతానికి పెరిగింది. ఈ కేటగిరిలో బీజేపీకి కొంత మొగ్గు కనిపించింది. అదే టైం లో కాంగ్రెస్ కి కూడా వారు అట్రాక్ట్ అవుతున్నారు అన్నది కూడా తెలుస్తోంది.

ఇక 56 ఏళ్ళ నుంచి ఆ మీదట వయసు కలిగిన వారు 2019లో కాంగ్రెస్ కి 20 శాతం ఓటు షేర్ ఉంటే 2024 ఎన్నికల్లో 22 శాతానికి పెరిగింది. ఇక బీజేపీకి ఈ కేటగిరీలో 2019లో 35 శాతం ఓటు షేర్ ఉంటే 2024లో కూడా 35 శాతం ఓటు షేర్ అలాగే ఉంది. అంటే ఈ కేటగిరిలో కాంగ్రెస్ వైపు ఓటర్లు పెరిగారు కానీ బీజేపీ వైపు ఎవరూ మళ్ళలేదు అని అంటున్నారు

ఇలా వివిధ వర్గాల ఓటు షేర్ ఉంది. దీనిని బట్టి చూస్తే బీజేపీకి అన్ని వయసుల వారిలో నెమ్మదిగా ఓట్ల షేర్ తగ్గిపోతోంది అని అంటున్నారు. ఇది ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి కావచ్చు. ప్రభుత్వ విధానాల మీద ఏర్పడిన యాంటీ ఇంకెంబెన్సీ కావచ్చు. లేదా పర్టిక్యులర్ గా తమ ఏజ్ కేటగిరీకి ప్రభుత్వం ఏమీ చేయడంలేదు అన్న భావన కావచ్చు. ఓవరాల్ గా దేశంలో బీజేపీ పాలన బాగా లేదు అని ఒక అభిప్రాయం కావచ్చు.

మొత్తంగా చూస్తే మాతం అన్ని వయసు వారు దూరం అవుతున్నారు. ముఖ్యంగా యూత్ మధ్య వయస్కులు బీజేపీకి దూరం అయి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం కమలం పార్టీకి డేంజర్ సిగ్నల్స్ లాంటిదే. దీని మీద ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.