Begin typing your search above and press return to search.

12 మందితో బీజేపీ నాలుగో జాబితా... ఇందులోనూ ట్విస్ట్ ఉంది!

ఇందులో భాగంగా 12 మంది పేర్లను ప్రకటించింది. అంతకు ముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితా, 35 మందితో మూడో జాబితానూ విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 9:09 AM GMT
12 మందితో బీజేపీ నాలుగో జాబితా... ఇందులోనూ ట్విస్ట్ ఉంది!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా నాలుగో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ. ఇందులో భాగంగా 12 మంది పేర్లను ప్రకటించింది. అంతకు ముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితా, 35 మందితో మూడో జాబితానూ విడుదల చేసింది. ఇక నాలుగో జాబితాలో తాజాగా 12 మందికి చోటు దక్కగా మొత్తం 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్లయ్యింది. అయితే ఈ జాబితాలోనూ కొన్ని ట్విస్ట్ లు నెలకొనడం గమనార్హం.

అవును... బీజేపీ నాలుగో విడతగా 12 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు నిరాశ ఎదురైంది. తనయుడు వికాస్ రావు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ అశించి భంగపడ్డారు. ఆ సీటు తుల ఉమకు దక్కింది. ఈ సీటు విషయంలో ఈటెల రాజేందర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారని అంటున్నారు.

ఇక మిగిలిన 19 స్థానాల్లో జనసేనకు 7 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోపక్క 8వ సీటు శేరిలింగంపల్లి విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతోంది. అదే టికెట్‌ తన అనుచరుడికి ఇప్పించుకునేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఈ సీటు విషయంలో ఇంకా సందిగ్దత నెలకొనే ఉంది.

ఈ జాబితా ప్రకారం 12మంది అభ్యర్థుల పేర్లు - నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి!

చెన్నూరు - దుర్గం అశోక్‌

ఎల్లారెడ్డి - సుభాష్‌ రెడ్డి

వేములవాడ - తుల ఉమ

సిద్దిపేట - దూది శ్రీకాంత్‌ రెడ్డి

హుస్నాబాద్‌ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి

వికారాబాద్‌ - పెద్దింటి నవీన్‌ కుమార్‌

మిర్యాలగూడ - సాధినేని శివ

కొడంగల్‌ - బంటు రమేశ్‌ కుమార్‌

గద్వాల్‌ - బోయ శివ

నకిరేకల్‌ - మొగులయ్య

మునుగోడు - చల్లమల్ల కృష్ణారెడ్డి

ములుగు - అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌