బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?
2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.
By: Tupaki Desk | 18 May 2024 3:49 PM GMTదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. దేశంలో అధికారం ఎవరు అందుకోవాలన్నా అతి పెద్ద నంబర్ తో ఎంపీలను ఇచ్చే రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి బిగ్ షాక్ ఈసారి తగులుతుందా అంటే విశ్లేషకులు అవును అనే అంటున్నారు. యూపీలో 80 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014, 2019లలో బీజేపీ అత్యధిక శాతం సీట్లు ఇక్కడే గెలుచుకుంది. 2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.
అదే కేంద్రంలో బీజేపీకి బలం అయింది. అలాంటి యూపీ బీజేపీకి ఇపుడు రివర్స్ లో షాక్ ఇస్తే మాత్రం అది చాలా రాజకీయ నష్టాన్ని కలిగిస్తుంది అని అంతా అంటున్నారు. బీజేపీకి కీలకమైన రాష్ట్రంగా ఉన్న యూపీలో ఈసారి పదిహేను సీట్లలో తగ్గిపోతాయని అని అంటున్నారు.
ప్రొఫేసర్ నాగేశ్వర్ దీని మీద ఒక యూట్యూబ్ చానల్ లో విశ్లేషణ చేస్తూ బీజేపీ మీద స్పష్టంగా అసంతృప్తి బీజేపీ మీద యూపీ ప్రజలలో కనిపిస్తోంది అని అన్నారు. యోగీ ప్రభుత్వం వచ్చాక పశు వధ శాలను నిషేధించారు. ఉపయోగపడలేని పశువులు ఇతరత్రా వంటి వాటిని అమ్ముకోవడానికి వారికి ఇబ్బందికరంగా ఉంది.
ప్రధాని కిసాన్ యోజన సాయం ఇస్తున్నా దాని కంటే అనేక రెట్లు ఈ పశువుల పోషణకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన రైతులు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర పెరగకపోవడంతో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉంది అని అన్నారు.
ఇక వివిధ సామాజిక వర్గాలు నాన్ యాదవ వర్గాలు జాట్ సామాజిక వర్గాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. రాజ్ పుట్లు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. గుజరాత్ బీజేపీ సీఎం రూపాలా రాజు పుట్లు మీద చేసిన వ్యాఖ్యలు అలగే యోగీ ఆదిత్యనాధ్ ని దించుతారు అన్న ప్రచారంతో కూడా వారు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అన్నది ఆయన విశ్లేషణగా ఉంది.
రాజ్ పుట్లు మీటింగులు పెట్టి మరీ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. జాట్లలో కూడా బీజేపీ మీద అధిక శాతం వ్యతిరేకత పెంచుతున్నారని అంటున్నారు. అలాగే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో యువత నిరుద్యోగం విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండి పోతున్నారు అని అంటున్నారు.
రైతాంగ ఉద్యమాన్ని జాట్లు నడిపారు. ఆ ఉద్యమం ద్వారా వ్యతిరేకతను బీజేపీ మూటకట్టుకుంది అని అంటున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేస్తారు అని పెద్ద ఎత్తున చేస్తున్న విపక్షాల ప్రచారం నేపధ్యంలో అది తీవ్ర స్థాయి వ్యతిరేకతను పెంచుతోంది అని అంటున్నారు.
దళిత్ జాతోలు యాదవ్ లు అంతా యూపీలో ఇపుడు ఏకీకృతం అవుతున్నారు అని అంటున్నారు. ఎస్పీ యూపీలో ఇచ్చిన పిలుపు కూడా బీజేపీకి సెగ తగిలేలా చేస్తోంది. ఎస్పీ సోషల్ ఇంజనీరింగ్ తో బీజేపీని దెబ్బ తీసే పని కూడా జరుగుతోంది. ఆ విధంగా కూడా యూపీలో కలవరపెడుతోంది అని అంటున్నారు.
అయితే ఇన్ని జరిగినా కూడా బీజేపీ బాగానే సీట్లు తెచ్చుకోవచ్చు అని అంటున్నారు. బీజేపీకి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ అలాగే మోడీ ఇమేజ్, యోగీ పాలన పట్ల ఉన్న వచ్చే సానుకూలత, అలాగే రామ మందిరం ఇష్యూ వల్ల సానుకూలత ఉంది. మజ్లిస్ వంటి పార్టీలు విడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభం. అయితే ఇపుడు వస్తున్న విశ్లేషణలు చూస్తే కనుక బీజేపీ పది నుంచి పదిహేను సీట్లు పైన చెప్పిన కారణాల వల్ల కోల్పోతుంది అన్నది ప్రొఫేసర్ చెబుతున్న విశ్లేషణగా ఉంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.