Begin typing your search above and press return to search.

బీసీ సీఎం అంటున్న బీజేపీ...40 మందితో ఫస్ట్ లిస్ట్...!

బీజేపీ ఇపుడు బీసీ కార్డుని బయటకు తీస్తోంది. తెలంగాణాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి బీసీ సీఎం అభ్యర్ధిగా ఎవరూ ఫోకస్ లో లేరు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 11:30 AM GMT
బీసీ సీఎం అంటున్న బీజేపీ...40 మందితో ఫస్ట్ లిస్ట్...!
X

బీజేపీ ఇపుడు బీసీ కార్డుని బయటకు తీస్తోంది. తెలంగాణాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి బీసీ సీఎం అభ్యర్ధిగా ఎవరూ ఫోకస్ లో లేరు అని అంటున్నారు. బీయారెస్ గెలిస్తే కేసీయార్ సీఎం అవుతారు. అలాగే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి తో పాటు చాలా మంది రెడ్లు ముందు వరసలో ఉంటారు. దాంతో బీజేపీ బీసీ సీఎం అంటోంది.

ఈ కార్డుతో వస్తే తమకు కొన్ని సీట్లు అయినా అనుకూలం అవుతాయి అన్న ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే బీయారెస్ అభ్యర్ధులను ఎపుడో ప్రకటించింది. కాంగ్రెస్ ఇటీవల 55 మంది అభ్యర్ధులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక బీజేపీ వంతు మిగిలి ఉంది.

బీజేపీకి మొత్తం 119 సీట్లలో అభ్యర్ధులు ఉన్నారా అన్నది ఒక చర్చ. బీయారెస్ అభ్యర్ధులను ప్రకటిస్తే సీటు రాని వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అక్కడకు వెళ్ళి జెండాను కప్పుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ లో సీటు దక్కని వారు బీయారెస్ లోకి వెళ్ళి చేరుతున్నారు. అలా జంపింగులు అన్నీ ఆ రెండు పార్టీల మధ్యనే కేంద్రీకృతం అయ్యాయి. దాంతో బీజేపీకి దింపుడు కళ్ళెం ఆశలు కూడా లేకుండా పోయాయని అంటున్నారు.

దాంతో బీజేపీ ఇక తన బలాన్ని బలగాన్ని తీయాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. బీజేపీ తొలి జాబితాకు తుది మెరుగులు దిద్దుతోంది అని అంటున్నారు. ఈ జాబితా కోసం తెలంగాణా బీజేపీ నేతలు ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు అని తెలుస్తోంది. ఇక తొలి జాబితాలో పేర్లు ఏమిటి ఎవరికి టికెట్లు అన్నది చూస్తే తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి మొదటి నుంచి పోటీ చేస్తూ వస్తున్న అంబర్ పేట నుంచే మరోమారు పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు.

అదే విధంగా కరీం నగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని అంటున్నారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారు. అలాగే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.ఆయన సతీమణి లక్ష్మిని తాను నిన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన మునుగోడు సీటు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

ఇక ఫైర్ బ్రాండ్ విజయశాంతి తాము సీఎం కేసీయార్ పోటీ చేస్తున్న రెండవ సీటు కామారెడ్డి నుంచి పోటీ పడతాను అని తన మనసులోని మాటను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అని అంటున్నారు. కేసీయార్ ని కామారెడ్డిలో ఓడించాలని బీజేపీకి ఉంది. దాంతో విజయశాంతిని అక్కడ నుంచి బరిలోకి దింపుతారు అని అంటున్నారు. ఇక గజ్వేల్ నుంచి పోటీకి ఈటెలకు అవకాశం ఇస్తారు అని కూడా అంటున్నారు. ఆయన కాకపోతే లోకల్ బీసీ లీడర్ కి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బీసీని సీఎం చేస్తామని బీజేపీ తన హామీతో బరిలోకి దిగుతుంది అని అంటున్నారు. మరి బీసీలు బీజేపీకి ఎంతవరకు మద్దతుగా నిలుస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీ తొలి జాబితాలో ఎవరెవరు ఉండబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.