Begin typing your search above and press return to search.

మాదిగ‌ల పోరాటానికి సంపూర్ణ మ‌ద్ద‌తు: మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన మాదిగ‌ల విశ్వ‌రూప మ‌హాస‌భ‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:40 PM GMT
మాదిగ‌ల పోరాటానికి సంపూర్ణ మ‌ద్ద‌తు:  మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X

మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన మాదిగ‌ల విశ్వ‌రూప మ‌హాస‌భ‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాదిగ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామ‌ని తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ విష‌యం న్యాయ వ్య‌వ‌స్థ‌లో ప‌రిధిలో ఉంద‌ని చెప్పారు. మాదిగ‌ల‌కు న్యాయం చేస్తామ‌ని అన్నారు. `వన్‌ లైఫ్‌, వన్‌ విషన్‌`లా మందకృష్ణ పోరాటం చేశారని కొనియాడారు. 30 ఏళ్ల మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాన‌ని స‌భ‌లో మాదిగ సామాజిక వ‌ర్గం యువ‌త క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య మోడీ ప్ర‌క‌టించారు.

ఇదేస‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వాల‌ను కూడా మోడీ విమ‌ర్శించారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశార‌ని, గత ప్రభుత్వాలకు, త‌మ ప్రభుత్వానికి తేడా గమనించాలని ఆయ‌న సూచించారు. 'సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌'.. అనేది త‌మ‌ విధానమ‌ని పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామ‌ని చెప్పారు. తెలంగాణ కోసం జ‌రిగిన‌ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని, అధికారంలో వచ్చాక బీఆర్‌ఎస్‌ అందరినీ విస్మరించిందని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిందన్న ప్ర‌ధాని.. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పార‌ని అన్నారు.

ద‌ళిత బంధు-కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు

కేసీఆర్ టార్గెట్‌గా మోడీ విమ‌ర్శ‌లు గుప్పించారు. దళితుల సీఎం కూర్చీని కేసీఆర్‌ కబ్జా చేశారని దుయ్య‌బ‌ట్టారు. మాదిగ సామా జికవర్గాన్ని కూడా విస్మరించారని, తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయిందని దుయ్య‌బ‌ట్టారు. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేద‌న్నారు. 3 ఎకరాల భూమి హామీని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాల‌న్నారు.

కొత్త రాజ్యాంగం పేరుతో అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారని మోడీ దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌ అంబేద్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించింద‌ని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ చిత్రపటం కూడా పెట్టలేదని దుయ్య‌బ‌ట్టారు. అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ వ‌చ్చాకే పార్ల‌మెంటులో అంబేద్కర్‌ ఫొటో పెట్టామ‌ని, భారతరత్న ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేన‌ని మోడీ చెప్పుకొచ్చారు.