Begin typing your search above and press return to search.

జగన్ తో ఎలాంటి మొహమాటాల్లేవు అంటున్న బీజేపీ ?

అదే తీరిపోతే పాతాళానికి తొక్కేస్తారు. ఇపుడు వైసీపీ విషయంలో బీజేపీకి మొహమాటాలు అన్నవి అసలు లేవు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:45 AM GMT
జగన్ తో ఎలాంటి మొహమాటాల్లేవు అంటున్న బీజేపీ ?
X

అవును రాజకీయం అంటే ఇదే. మొహమాటాలు ఉంటేనే కధ సాగుతుంది. బంధాలు అనుబంధాలు అన్నవి బొత్తిగా తెలియని రంగం అంది. అవసరం ఉంటే అందలం ఎక్కిస్తారు. అదే తీరిపోతే పాతాళానికి తొక్కేస్తారు. ఇపుడు వైసీపీ విషయంలో బీజేపీకి మొహమాటాలు అన్నవి అసలు లేవు అని అంటున్నారు.

దానికి కారణం రాజ్యసభలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు గానూ బీజేపీకి చెందిన వారు ఆ పార్టీ మిత్ర పక్షాలకు చెందిన వారే ఏకంగా 11 సీట్లను కైవశం చేసుకోనున్నారు. దాంతో రాజ్యసభలో ప్రస్తుతానికి ఉన్న 237 సంఖ్యా బలంలో సగం కంటే ఒకటి ఎక్కువ అయిన మ్యాజిక్ ఫిగర్ 119ని బీజేపీ దాటేసినట్లు అయింది.

బీజేపీ దాని మిత్రపక్షాలకు కలిపి 121 సీట్లు పెద్దల సభలో ఉన్నాయి. ఇందులో బీజేపీ వాటా 96 ఎంపీలు ఉన్నారు. అదే మిత్రులకు పాతిక మంది ఎంపీలు ఉన్నారు. ఇంతేకాదు వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న కాశ్మీర్ తో పాటు నామినేటెడ్ ఖాళీలు అన్నీ చూస్తే మరో ఎనిమిది సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా బీజేపీకే దక్కుతాయని లెక్క వేస్తున్నారు.

ఆ విధంగా చూస్తే రాజ్యసభలో ఎన్డీయే బలం 129 అవుతుంది. దాంతో ఫుల్ మెజారిటీ సాధించినట్లే అని అంటున్నారు. ఇక 11 మంది వైసీపీ ఎంపీల అవసరం లేదని కూడా అంటున్నారు. ఇక రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలలు చూస్తే ఎన్డీయేకి 121, కాంగ్రెస్ కి 27, టీఎంసీకి 13, ఆప్ కి 10, డీఎంకే 10, ఆర్జేడీ 5 ఎంపీల బలం ఉంది. అంటే ఇండియా కూటమికి 88 మంది మాత్రమే ఉన్నారు. వైసీపీకి 11 మంది ఉంటే బీజేడీకి తొమ్మిది మంది ఉన్నారు.

ఇలా రాజ్యసభ లో నంబర్ గేమ్ పూర్తిగా కమలం పార్టీకి అనుకూలంగా ఉంది. దాంతో వైసీపీని ఫ్యూచర్ లో ఇంకా దూరం పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్డీయేలో టీడీపీ జనసేన ఉన్నాయి. వారి అభిప్రాయాలకు భిన్నంగా బీజేపీ అసలు నడచుకోదు అని అంటున్నారు.

అంత రిస్క్ చేసి వైసీపీకి ఏ విధంగా అయినా సపోర్ట్ చేయాల్సిన ప్రాణావసరాలు కూడా లేవు అని చెబుతున్నారు. వైసీపీ 11 నంబర్ అసెంబ్లీలో ఎలా ఉందో రాజ్యసభలోనూ అలాగే ఉండబోతోంది అని అంటున్నారు. బీజేపీతో కలసి కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇదే అదనుగా జగన్ ని టార్గెట్ చేయవచ్చు అని అంటున్నారు. అపుడు బీజేపీ కూడా సహకరించవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పెద్దల సభలో ఆశలు కూడా వైసీపీకి లేవు అని తేలుతున్న సత్యం.

వైసీపీ ముందు ఆప్షన్ ఏంటి అంటే బీజేపీకి ఎదురు నిలిచి డేరింగ్ గా పోరాడడమే అని అంటున్నారు. అంతే కాదు ఇండియా కూటమి వైపుగా రావడం కూడా బెటర్ అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ కమలం చుట్టూ పొద్దు తిరుగుడు రాజకీయం చేస్తుందా లేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది.