రాహుల్ గాంధీని ఆపండిరా బాబూ....మొత్తుకుంటున్న బీజేపీ హైకమాండ్!
సభలో రాహుల్ గాంధీ అలా లేచారో లేదో బీజేపీకి చెందిన ఎంపీలు గోల స్టార్ట్ చేస్తూ ఆయనను మాట్లాడనీయకుండా చేస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Aug 2024 11:30 PM GMTరాహుల్ గాంధీ పప్పు అన్న నిక్ నేమ్ పెట్టి బీజేపీ సైడ్ చేసినా ఆయన మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి నిప్పు కణిక గా మారారు. గత పదేళ్ళుగా చూస్తే ఆయన తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు ఒక అద్భుతం అని చెప్పాలి. ఆయన ఒకనాడు స్పీచ్ ఇస్తే ఫుల్ ట్రోలింగ్ గా మారేది. కానీ ఇపుడు ఆయన స్పీచ్ పదును తేరింది.
పార్లమెంట్ లో కానీ బయట కానీ అధికార బీజేపీ మీద ఆయన పేల్చుతున్న పంచులు సెటైలు వేస్తున్న కౌంటర్లు బాంబులుగా మారి కమలం పార్టీని కకావికలం చేస్తున్నాయి. గత రెండు టెర్ములలో ఫుల్ మెజారిటీతో బీజేపీ ఉంది. బలహీనమైన ప్రతిపక్షం ఉండడంతో బాగా ఎంజాయ్ చేసిన బీజేపీ పెద్దలకు ఈసారి పార్లమెంట్ లో అపొజిషన్ పొజిషన్ ఏంటో బాగా తెలిసి వస్తోంది అని అంటున్నారు.
ఇండియా కూటమి పేరుతో 230 సీట్లు సాధించి చాలా దగ్గరకు వచ్చేశారు. బీజేపీ ట్రెజరీ బెంచీల వైపు ఉంటే అపొజిషన్ ఎదురుగా ఉంటూ అధికార పార్టీకి సరిపడా తామూ ఉన్నామని నిరూపించుకుంటున్నారు. ఇండియా కూటమి తరఫున నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ లోక్ సభలో అపొజిషన్ లీడర్ అయ్యారు.
ఆయన బడ్జెట్ సెషన్ లో కానీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చేసిన ప్రసంగంలో కానీ బీజేపీ మీద నిప్పులే చెరుగుతున్నారు. దాంతో రాహుల్ స్పీచ్ ని దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. రాహుల్ ధాటిని అధికార పార్టీ ఆపలేక సతమతమవుతోంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో లోక్ సభలో రాహుల్ గాంధీ దెబ్బకు నరేంద్ర మోడీ అమిత్ షా సహా అగ్ర నేతలు అంతా బెంబేలెత్తుతున్న నేపధ్యం ఉంది అని అంటున్నారు. సభలో రాహుల్ గాంధీ అలా లేచారో లేదో బీజేపీకి చెందిన ఎంపీలు గోల స్టార్ట్ చేస్తూ ఆయనను మాట్లాడనీయకుండా చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక గురువారం నాటి సభలో రాహుల్ గాంధీ లేచి మాట్లాడేందుకు సన్నద్ధం అవుతూంటే వయనాడ్ గురించే కదా అని స్పీకర్ అన్నారూ అంటే ఇంక ఆయన ఏమి మాట్లాడుతారో అని బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు అని అంటున్నారు. ఆల్ రెడీ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నపుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తలను పట్టుకున్నారు కూడా అని అంటున్నారు.
ఇపుడు కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కింది కాబట్టి రాహుల్ గాంధీ రెచ్చిపోయి విరగదీస్తున్నారు అని అంటున్నారు. ఏ అంశం మీద అయినా ఎపుడైనా అపొజిషన్ లీడర్ లేచి నిలబడి మాట్లాడేందుకు అవకాశం కోరితే ఇవ్వాలని రూల్ ఉంది. దాంతో దానిని సద్వినియోగం చేసుకుంటూ రాహుల్ గాంధీ సభలో తనదైన శైలిలో అధికార పక్షం మీద విమర్శనా బాణాలే వేస్తున్నారు అని అంటున్నారు.
గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ మీద దేశ ప్రజలకు అటెన్షన్ బాగా పెరిగింది. ఆయన మీద సానుభూతి కూడా ఏర్పడుతోంది. ఈసారి రాహుల్ గాంధీ అపొజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆయన రాజకీయంగా రాణిస్తున్నారు కాబట్టి ఆయన గురించి చర్చించుకునే పరిస్థితి ఉంది. అంతే కాదు కొత్త నాయకత్వం కోసం చూసే వారికి యువతకు ఆయన ఆశా కిరణంగా మారుతున్నారు. గత పదేళ్లలో బీజేపీ మీద పెరిగిన వ్యతిరేకత కూడా రాహుల్ వైపు జనాలను మొగ్గేలా చేస్తోంది.
తాము అనుకున్నది ప్రజల సమస్యలు అన్నీ పార్లమెంట్ వేదికగా రాహుల్ నిలదీస్తూ అధికార పార్టీని నిలబెడుతున్న తీరు ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. దాంతో ప్రజానీకం అంతా రాహుల్ వైపు ఆయన స్పీచ్ వైపు చూస్తున్నారు. అలా రాహుల్ గ్రాఫ్ కూడా బాగా పెరుగుతోంది.
గతంలో దేని మీద సరైన అవగాహన పెంచుకోకుండా రాహుల్ మాట్లాడేవారు అన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఇపుడు అలా కాదు రాహుల్ గాంధీ ఫుల్ మెచ్యూరిటీతో ప్రసంగాలు చేస్తున్నారు. దాంతో రాహుల్ గాంధీ మీద నెమ్మదిగా నమ్మకం పెరుగుతోంది. ఆ సంగతి అవగతమైన బీజేపీ వర్గాలు రాహుల్ ని నిలవరించేందుకు చూస్తున్నారు. ఆయన్ని సభలో నియంత్రించేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఎంతలా బీజేపీ చేసినా రాహుల్ కి అంతలా క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు అని అంటున్నారు.
రాహుల్ గాంధీ విషయంలో జనంలో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ అటు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో ఎనలేని ధీమాను పెంచుతూంటే ఎన్డీయే కూటమికి దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది అని అంటున్నారు.